హెల్త్ టిప్స్

ఏయే అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు వేపాకుల‌ను ఎలా ఉప‌యోగించాలంటే..?

వేప అనేక సమస్యలకు మంచి ఔషధం. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి, జీర్ణ వ్యవస్థలో వచ్చే అల్సర్స్ కు, బ్యాక్టీరియాను చంపడానికి, ఇలాంటి వాటి అన్నింటికీ వేప ఎంతగానో ఉపయోగపడుతుంది. వేప నోటికి సంబంధించిన సమస్యలకు ఎంతో ప్రయోజనం. ఒక గ్లాసు నీటిలో కొద్దిగా వేప నూనె కలిపి. ఆ నీటితో నోటిని పుక్కిలించాలి, ఇలా చేయడం వల్ల చిగుళ్ల నుంచి రక్తం కారడం, అల్సర్స్, చిగుళ్ల నొప్పులు వంటి ఎటువంటి సమస్య అయినా తగ్గిపోతుంది. ముఖ్యంగా నోటికి సంబంధించిన ఎటువంటి సమస్య దరిచేరకుండా ఉండడానికి వేప సహాయపడుతుంది. పాదాలను శుభ్రం చేయడానికి వేప నూనె బాగా ఉపయోగపడుతుంది. పాదాలను శుభ్రంగా కడిగి వేప నూనెతో మర్దన చేసుకుంటే కాలి గోళ్ళ లో మురికి సైతం పోయి ఎటువంటి ఇన్ఫెక్షన్లు రాకుండా చేస్తుంది. వేప నూనె కు బదులుగా వేప ఆకుల గుజ్జును కూడా వాడవచ్చు.

మొటిమలు, ఫంగల్ ఇన్ఫెక్షన్లు తో ఇబ్బంది పడుతున్న వారు ముఖానికి వేపనూనెను రాసుకుని 20 నిమిషాల‌ తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. ఇలా ప్రతి రోజూ చేయడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు. పేప పుల్లలను ఎండబెట్టి, వాటిని పొడి చేసుకొని ప్రతిరోజు 1 టీ స్పూన్ పొడిని గోరువెచ్చని నీటితో కలుపుకొని తాగడం వల్ల మలేరియా, కడుపు లో అల్సర్స్, చర్మ వ్యాధులు వంటి సమస్యలు రావు.

taking neem leaves in these ways will give wonderful health benefits

వేప ఫేస్ మాస్క్ వారానికి ఒకసారైనా వేసుకుంటే స్కిన్ టోన్ మరింత మెరుగు పడుతుంది. వేప ఆకులను నీటితో కలిపి పేస్ట్ లా చేసుకోవాలి, ఈ మిశ్రమంలో పసుపు కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. ఈ ఫేస్ మాస్క్ ను ఇరవై నిమిషాల తర్వాత తీసి, గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి.

తలలో చుండ్రు ఎక్కువగా ఉన్న వారు వేప నూనెతో మర్దన చేసుకుని ఆ తర్వాత తలస్నానం చేస్తే తప్పకుండా ఫలితం ఉంటుంది. వేప నూనె బదులుగా వేప ఆకుల పేస్ట్ ను వాడవచ్చు. నెలకు ఒకసారైనా ఇలా చేస్తే చుండ్రు సమస్య పోతుంది.

Admin

Recent Posts