హెల్త్ టిప్స్

క‌ళ్లు అందంగా, ఆక‌ర్ష‌ణీయంగా ఉండాలంటే ఇలా చేయండి..!

స‌హ‌జంగా క‌ళ్లు ప్ర‌తి ఒక్క‌రిలో ఆక‌ర్ష‌నీయంగా క‌నిపిస్తాయి. క‌ళ్లు అందంగా ఉండే అందాన్ని మ‌రింత పెంచుతుంది. మన శరీర అవయవాలలో కళ్ళు ఎంత ప్రధానమైనవో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్ర‌స్తుత రోజుల్లో కంప్యూట‌ర్‌లు, ఫోన్ల ఉప‌యోగం ఎక్కువ‌గా ఉండ‌డంతో వాటి ఎఫెక్ట్ కంటిపై బాగా ప‌డుతుంది. దీంతో అనేక కంటి స‌మ‌స్య‌లు రావ‌డానికి అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటున్నాయి.

కళ్లు త్వరగా అలసిపోవడం, కళ్ల కింద నల్లని వలయాలు రావడం వంటివి కంప్యూటర్‌పై పనిచేసేవాళ్లకు తరచూ జరుగుతుంటాయి. మ‌రి క‌ళ్లు అందంగా, ఆరోగ్యంగా ఉంచుకోవ‌డం చాలా అవ‌స‌రం. క‌ళ్లు ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపించ‌డం వ‌ల్ల అందాన్ని రెట్టింపు చేస్తుంది. దీని కొన్ని టిప్స్ ఫాలో అయితే స‌రిపోతుంది..

– కీరదోస ముక్కల‌ను కట్ చేసి వాటిని ఫ్రిడ్జ్ లో ఉంచాలి. ఈ కీరదోస ముక్కలను పడుకునే ముందు లేదా మీరు బయట నుండి ఇంటికి వచ్చినప్పుడు కళ్లపై పెట్టుకుని నిద్రించడం వల్ల‌ కళ్ళకు చాలా మంచిది.

if you want beautiful eyes then do like this

– రకరకాల కాంటాక్ట్‌ లెన్స్‌ పెట్టుకున్నప్పుడు వాటికి సరిపడేట్టుగా ఆ రంగు మస్కారా వేసుకుంటే ఆకర్షణీయంగా ఉంటాయి.

– పచ్చి పాలలో దూదిని ఉంచి కళ్ల చుట్టూ మసాజ్ లా చేసుకోవాలి. ఇలా చేయడం వలన కళ్ళ చుట్టూ ఉన్న జిడ్డు, మురికి మరియు నల్లని మచ్చలు త‌గ్గుతాయి.

– క‌ళ్ళు అందంగా ఆకర్షణీయంగా కనిపించాలంటే కాటుక పెట్టుకోవాలి. అయితే గ్రామాలలో కొందరు సహజంగా కాటుకలు తయారు చేస్తూ ఉంటారు. అవి వాడటం మంచిది.

– నిద్రలేని కళ్లు నిర్జీవంగా కనబడతాయి. ఎనిమిది గంటల నిద్ర, కంటికి విశ్రాంతి ఉంటే కళ్లు అలసటగా కనిపించవు. కనుబొమ్మలను అందంగా, క్రమపద్ధతిలో కనిపించేలా చేయడం వలనా కళ్లు మరింత ఆకర్షణీయంగా కనబడతాయి.

Admin

Recent Posts