హెల్త్ టిప్స్

పిల్ల‌లు పుట్టాలంటే మగాళ్లు మద్యం మానేయాలి.. ఎందుకంటే..

మద్యం అనేది ఇప్పుదు దైనందిన జీవితంలో ఒక భాగంగా మారిపోయింది. మగవాళ్లు వీకెండ్ వచ్చిందంటే చాలు పార్టీలు.. పబ్బులంటూ మద్యం తెగ తాగేస్తున్నారు. అలాగే రాత్రి పూట మ‌ద్యం తాగ‌నిదే నిద్ర ప‌ట్ట‌దు అన్న వాళ్లు కూడా ఉంటారు.

అయితే వీళ్లంద‌రికీ ఓ చేదు వార్త‌. తమకు పుట్టబోయే పిల్లలు మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంతో ఉండాలంటే పురుషులు, తమ భార్యలు గర్భం ధరించడానికి 6 నెలలు ముందుగానే ఆల్కహాల్‌ తీసుకోవడం మానేయాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

if you want kids stop taking alcohol

తద్వారా పిల్లల్లో పుట్టుకతో వచ్చే గుండె జబ్బులను నిరోధించవచ్చని చెప్తున్నారు. మహిళలు తమ గర్భధారణకు ఏడాది ముందు నుంచే ఆల్కహాల్‌ మానేయాలని తెలిపారు. ఆల్కహాల్‌ తీసుకొన్నవారి పిల్లల్లో ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం 42 శాతం ఎక్కువని తెలిపారు. దాదాపు 30 ఏళ్ల డాటా ఆధారంగా, 3.40 లక్షల మందిపై పరిశోధనలు చేసి ఈ విషయాన్ని వెల్లడించారు.

Admin