Sleep : 7 గంట‌ల పాటు గాఢంగా నిద్ర‌పోవాలంటే.. ఇలా చేయాలి..!

Sleep : ప్ర‌స్తుత త‌రుణంలో మ‌న‌లో చాలా మంది నిద్ర‌లేమి స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. దీని వ‌ల్ల మ‌న‌కు అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌చ్చే అవ‌కాశం కూడా ఉంది. మ‌నం రాత్రి భోజ‌నం తిన‌గానే మ‌త్తుగా అనిపించి నిద్ర పోతాము. కానీ మ‌నం గాఢ నిద్ర పోవ‌డానికి చాలా స‌మ‌యం ప‌డుతుంది. మ‌న‌లో చాలా మంది సుమారుగా తెల్లవారు జాము నుండి గాఢ నిద్ర పోతుంటారు. రాత్రి భోజ‌నం చేసిన త‌రువాత వ‌చ్చే మ‌త్తు నిద్ర వ‌ల్ల మ‌న శ‌రీరానికి అంత‌గా ఉప‌యోగం ఉండ‌ద‌ని, గాఢ నిద్రనే మ‌న శ‌రీరానికి ఎంతో మేలు చేస్తుంద‌ని నిపుణులు చెబుతున్నారు.

if you want to Sleep for 7 hours do like this
Sleep

మ‌నం రోజుకి క‌నీసం 6 నుండి 7 గంట‌లు గాఢ నిద్ర పోవాల‌ని వారు చెబుతున్నారు. మ‌నం రాత్రి భోజ‌నం చేసి ప‌డుకోవ‌డం వ‌ల్ల మన శ‌రీరంలో కొన్ని అవ‌య‌వాల‌కు మాత్రమే విశ్రాంతి ల‌భిస్తుంది. మ‌న శ‌రీరంలో ఉండే జీర్ణాశ‌యం మ‌నం తిన్న ఆహారాన్ని జీర్ణం చేయ‌డానికి ప‌ని చేయాల్సి వ‌స్తుంది. మ‌న శరీరంలో ప్ర‌తి అవ‌య‌వం విశ్రాంతి తీసుకుంటేనే మ‌నం గాఢ నిద్ర పోగ‌ల‌మ‌ని నిపుణులు చెబుతున్నారు. మ‌నం త్వ‌ర‌గా గాఢ నిద్ర పోవ‌డానికి మ‌నం సాయంత్రం తినే భోజ‌నాన్ని 6 నుండి 7 గంట‌లలోపే తినాలి. ఈ భోజ‌నంలో కేవ‌లం పండ్లు మాత్ర‌మే తినాలి.

త‌గిన బ‌రువు ఉన్న వారు, బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు కేవ‌లం పండ్ల‌ను మాత్ర‌మే తినాలి. బ‌రువు త‌క్కువ‌గా.. నీర‌సంగా ఉన్న వారు పండ్ల‌తో పాటు నాన‌బెట్టిన డ్రై ఫ్రూట్స్ ను తిన‌వ‌చ్చు. సాయంత్రం భోజ‌నంలో పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల అవి త్వ‌ర‌గా జీర్ణ‌మ‌వుతాయి. దీంతో మ‌న శరీరంలో ప్ర‌తి అవ‌య‌వానికి విశ్రాంతి ల‌భించి మనం ప‌డుకోగానే గాఢ నిద్ర‌లోకి జారుకుంటామ‌ని నిపుణులు చెబుతున్నారు. సాయంత్రం భోజ‌నంలో కేవలం పండ్ల‌ను మాత్ర‌మే తిన‌డం వ‌ల్ల త్వ‌ర‌గా నిద్ర వ‌చ్చి, ప‌డుకోగానే గాఢ‌ నిద్ర‌లోకి జారుకుంటామ‌ని, ఈ గాఢ నిద్రే మ‌న శ‌రీరానికి ఎంతో మేలు చేస్తుంద‌ని నిపుణులు చెబుతున్నారు.

Share
D

Recent Posts