హెల్త్ టిప్స్

Foods : ప‌థ్యం స‌మ‌యంలో ఎలాంటి ఆహారాల‌ను తినాలి.. వేటిని తిన‌కూడ‌దు.. తెలుసా..?

Foods : పథ్యం శతగుణం ప్రపోక్తం అని శాస్త్రోక్తం కనుక సర్వ వైద్యములకు పథ్యం చేయడం శ్రేయస్కరం. కొన్ని రకాల వ్యాధులు వచ్చినప్పుడు పథ్యం తప్పనిసరి అని డాక్టర్లు కూడా చెబుతారు. పథ్యమంటే తినతగినవి, అపథ్యం అంటే తినరానివి. ఎన్ని రకాల నియమాలు పాటించినా ఏదో విధంగా అనారోగ్యం బారిన పడుతున్నాం. కాబట్టి మన ఆరోగ్యానికి మేలు చేసే పథ్యం పాటించడంలో తప్పులేదు. పథ్యం చేసేప్పుడు తినకూడనివి, తినేవి ఏంటో తెలుసుకోండి.

బీరకాయ, పొట్లకాయ, బీట్రూట్, అరటికాయ, దొండకాయ, తోటకూర, మెంతికూర, పొన్నగంటికూర, దోసకాయ, ఆనపకాయ, పొట్టు పెసరపప్పు, మినప ప‌ప్పు, కందిపప్పు, క్యారట్, అరటిపువ్వు కూర తినదగిన కూరలు. అపథ్యమంటే తినకూడనవి.. గొర్రె మాంసం, కొబ్బరికాయ, వంకాయ, గోంగూర, చేపలు పచ్చివి, ఎండువి, పీతలు ఆవకాయ, గుమ్మడికాయ, కొత్త చింతకాయ, శనగ పప్పు, ఆనుమల పప్పు తినకూడ‌దు.

in pathyam time which foods we have to eat and which ones we have to avoid

పచ్చళ్లు చాలామందికి ఇష్టం. కొంతమంది ఎటువంటి కూరలు లేకపోయినా పచ్చళ్ల‌తోనే సరిపెట్టేసుకుంటారు. కానీ పథ్యం అనేది పచ్చళ్ల‌కు కూడా వర్తిస్తుంది.. అవేంటో తెలుసుకోండి.. నిమ్మకాయ, మాగాయ పచ్చడి, కరివేపాకు, కొత్తిమీర పచ్చడి, అల్లపు పచ్చడి తినవచ్చు. ఆనపకాయ, దోసకాయ, పెసరపప్పు, కొత్తచింతకాయ, ఉసిరికాయ పచ్చడి తినకూడదు. రాత్రిపూట నిమ్మకాయ పచ్చడి, ఉసిరికాయ పచ్చడి తినకూడదు. రాత్రిపూట వాతమధికముగా ఉంటుంది కాబట్టి నిమ్మకాయ, ఉసిరికాయ పచ్చళ్లు తింటే తలలోని సూక్ష్మాతి సూక్ష్మనాడులు పగిలిపోవటం వల్ల పక్షవాతం రోగము రావచ్చు. క‌నుక ప‌థ్యం స‌మ‌యంలో ఎలాంటి ఆహారాల‌ను తినాలి.. వేటి తిన‌రాదు.. అని తెలుసుకోవాలి. లేదంటే ఇబ్బందులు ప‌డ‌తారు.. అనే విష‌యాల‌ను గుర్తుంచుకోవాలి.

Admin

Recent Posts