ఇంగువను భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచి ఉపయోగిస్తున్నారు. దీన్ని అనేక వంటల్లో చాలా మంది వేస్తుంటారు. దీంతో వంటకాలకు చక్కని రుచి, వాసన వస్తాయి. ఇంగువ వేసి వండిన పదార్థాలను చాలా మంది ఇష్టంగా తింటారు. అయితే ఇంగువ వల్ల మనకు ఆరోగ్యకర ప్రయోజనాలు కూడా కలుగుతాయి. అవేమిటంటే…
1. ఇంగువను ఆహారాల్లో తీసుకోవడం వల్ల గ్యాస్, పేగుల్లో పురుగులు, ఇర్రిటబుల్ బౌల్ సిండ్రోమ్, అజీర్ణం, కడుపునొప్పి, కడుపు ఉబ్బరంగా ఉండడం, మలబద్దకం, డయేరియా, అల్సర్లు వంటి సమస్యలు ఉండవు.
2. ఇంగువలో యాంటీ వైరల్, యాంటీ బయోటిక్, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. అందువల్ల శ్వాసకోశ సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. శరీరంలో అధికంగా ఉండే మ్యూకస్ కరుగుతుంది. దీంతోపాటు బాక్టీరియా ఇతర సూక్ష్మక్రిములు నశిస్తాయి. శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. బ్రాంకైటిస్, ఆస్తమా, కోరింత దగ్గు వంటి సమస్యలు ఉన్నవారికి ఇంగువ ఎంతగానో మేలు చేస్తుంది.
3.ఇంగువను తీసుకోవడం వల్ల స్త్రీలకు వారి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. రుతు సమయంలో అధికంగా రక్తస్రావం కాకుండా ఉంటుంది. అలాగే సంతాన లోపం, ముందుగానే ప్రసవ నొప్పులు రావడం వంటి సమస్యలు ఉండవు.
4. దంతాలు, చెవుల నొప్పి ఉన్నవారికి ఇంగువ ఎంతగానో మేలు చేస్తుంది. ఒక గ్లాస్ నీటిలో కొద్దిగా ఇంగువను కలిపి నోట్లో ఆ నీరు పోసి బాగా పుక్కిలిస్తే దంతాల నొప్పి తగ్గుతుంది. అలాగే కొబ్బరినూనె, ఇంగువను కలిపి ఆ మిశ్రమాన్ని రెండు చుక్కల మోతాదులో చెవుల్లో వేస్తే చెవి నొప్పి తగ్గుతుంది. ఇంగువలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు నొప్పులు, వాపులను తగ్గిస్తాయి.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365