Juice For Skin : ఈ జ్యూస్‌ను తాగితే మీ ముఖంపై ఒక్క మొటిమ కూడా ఉండ‌దు..!

Juice For Skin : స్త్రీ, పురుషులు ఎవ‌రైనా స‌రే త‌మ చ‌ర్మం ఆరోగ్యంగా ఉండాల‌ని కోరుకుంటారు. అయితే వాతావ‌ర‌ణంలో చోటు చేసుకునే మార్పుల‌తోపాటు చెడు ఆహార‌పు అల‌వాట్లు, రాత్రి ఆల‌స్యంగా తిన‌డం, నిద్ర‌పోవడం, ఒత్తిడి ఎక్కువ‌గా ఉండ‌డం, అస్త‌వ్య‌స్త‌మైన జీవ‌న శైలి వంటి కార‌ణాల వ‌ల్ల చ‌ర్మం ప్ర‌భావితం అవుతుంది. దీంతో చ‌ర్మంపై మొటిమ‌లు, మ‌చ్చ‌లు వ‌స్తాయి. క‌నుక ప్ర‌తి ఒక్క‌రు త‌మ చ‌ర్మ ఆరోగ్యంపై శ్ర‌ద్ధ వ‌హించాల్సి ఉంటుంది. అయితే ఒక్కోసారి హార్మోన్ల మార్పుల కార‌ణంగా కూడా మొటిమ‌లు ఏర్ప‌డుతుంటాయి. క‌నుక ఆహారాల విష‌యంలో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది.

మ‌నం రోజూ తినే ఆహారం మ‌న ఆరోగ్యంపైనే కాకుండా మ‌న చ‌ర్మంపై కూడా ప్ర‌భావం చూపిస్తుంది. ఎందుకంటే కొన్ని ర‌కాల పండ్లు, కూర‌గాయ‌లు మ‌న‌కు మేలు చేస్తే.. కొన్ని హాని చేస్తాయి. కొన్ని ర‌కాల ఆహారాల‌ను తీసుకోవ‌డం మానేయాలి. ఇక చ‌ర్మ సంర‌క్ష‌ణ కోసం ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.

Juice For Skin take daily for better health and benefits
Juice For Skin

5 ఆరోగ్య‌క‌ర‌మైన ప‌దార్థాల‌తో త‌యారు చేసే ఓ జ్యూస్‌ను తాగ‌డం వ‌ల్ల మీ చ‌ర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ ల‌క్ష‌ణాల‌తోపాటు విట‌మిన్ కె, సి, ఎ స‌మృద్ధిగా ఉంటాయి. అందువ‌ల్ల ఈ జ్యూస్ కొల్లాజెన్ ఏర్ప‌డేందుకు స‌హాయ‌ప‌డుతుంది. కొల్లాజెన్ మ‌న చ‌ర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది కొత్త క‌ణాలు ఏర్ప‌డేలా చేస్తుంది. అందువ‌ల్ల చ‌ర్మ స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. ఇక ఈ జ్యూస్‌ను త‌ర‌చూ తాగ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితాలు వ‌స్తాయి.

ఈ జ్యూస్‌ను త‌యారు చేసేందుకు గాను ముందుగా యాపిల్‌ను క‌ట్ చేసి మ‌ధ్య‌లో వేరు చేయాలి. అనంత‌రం కీరదోస‌, క్యారెట్‌, బీట్‌రూట్‌ల‌ను క‌ట్ చేసి వాటిని మిక్సీ జార్‌లోకి తీసుకోవాలి. అందులోనే దానిమ్మ గింజ‌లు వేయాలి. ఈ మొత్తం ప‌దార్థాల‌ను మిక్సీ ప‌ట్టి జ్యూస్ తీయాలి. ఈ జ్యూస్‌ను క‌నీసం 21 రోజుల పాటు తాగాల్సి ఉంటుంది. దీంతో చ‌ర్మ స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. అయితే అల‌ర్జీలు ఉన్న‌వారు డాక్ట‌ర్ సూచ‌న మేర‌కు దీన్ని తాగాల్సి ఉంటుంది.

Share
Editor

Recent Posts