Juices For Liver : మన శరీరంలోని ముఖ్యమైన అవయవాల్లో లివర్ కూడా ఒకటి. ఇది అనేక రకాల పనులను నిర్వర్తిస్తుంది. పిత్త రసాన్ని ఉత్పత్తి చేస్తుంది. రక్తాన్ని శుభ్ర పరుస్తుంది. జీర్ణక్రియలను సజావుగా నిర్వహిస్తుంది. శరీరంలో అవసరమైన విటమిన్లు, మినరల్స్‌ను నిల్వ చేయడంలో సహాయం చేస్తుంది. ఆహారం సరిగ్గా తీసుకోకపోయినా లేదంటే అస్తవ్యస్తమైన జీవనశైలి అయినా లివర్ దెబ్బ తింటుంది. ఈ క్రమంలోనే దెబ్బ తిన్న లివర్‌ను మళ్లీ పునరుద్ధరించాలి. లేదంటే ఇబ్బందులు వస్తాయి. ఇక లివర్‌ను ఆరోగ్యంగా ఉంచేందుకు పలు రకాల కూరగాయలు, ఆకుకూరలు ఎంతగానో ఉపయోగపడతాయి. వీటిని తీసుకోవడం వల్ల లివర్‌ను ఆరోగ్యంగా ఉంచవచ్చు. ఇవి శరీరం నుంచి విషాన్ని బయటకు పంపిస్తాయి. కాలేయాన్ని శుభ్రపరుస్తాయి. ఇక అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
క్యారెట్ జ్యూస్ లివర్‌కు చాలా మేలు చేస్తుంది. క్యారెట్లలో బీటా కెరోటిన్ ఉంటుంది. ఇది మన శరీరంలో విటమిన్ ఎ గా మారుతుంది. ఇది లివర్‌కు ఉపయోగకరంగా ఉంటుంది. ఇది లివర్‌ను దెబ్బ తినకుండా చూస్తుంది. జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది. ఇక బీట్‌రూట్ జ్యూస్‌ను తాగినా కూడా లివర్ ఆరోగ్యంగా మారుతుంది. ఇందులో పొటాషియం, ఫైబర్, మాంగనీస్, విటమిన్ ఎ, సి ఉంటాయి. బీట్‌రూట్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రక్తాన్ని శుభ్రం చేస్తాయి. లివర్‌ను ఆరోగ్యంగా ఉంచుతాయి. కనుక రోజూ బీట్‌రూట్ జ్యూస్‌ను తాగినా కూడా లివర్ శుభ్రంగా ఉంటుంది.
పాలకూరలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి లివర్‌ను డిటాక్సిఫై చేస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లు లివర్‌ను కాపాడుతాయి. అలాగే శరీరాన్ని శుభ్ర పరుస్తాయి. కనుక రోజూ పాలకూర జ్యూస్‌ను కూడా తాగవచ్చు. అయితే ఇందులో నిమ్మరసం కలిపి తాగాల్సి ఉంటుంది. ఇక రోజూ నెయ్యిని తీసుకుంటున్నా కూడా లివర్ శుభ్రంగా మారుతుంది. నెయ్యిలో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ లక్షణాలు ఉంటాయి. అందువల్ల లివర్ వాపులకు గురి కాకుండా చూస్తాయి. లివర్‌ను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇలా రోజూ ఈ ఆహారాలను తీసుకోవడం వల్ల లివర్‌ను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.