ఈ రోజుల్లో జీవన శైలి పూర్తిగా మారడంతో ప్రజల ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుంది. కొత్త కొత్త రోగాలు పుట్టుకురావడం,వాటి వలన ప్రజలు ఇబ్బంది పడడం జరుగుతుంది. అయితే ఈ మధ్య కాలంలో చాలా మంది కిడ్నీలో రాళ్ల సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. కిడ్నీ స్టోన్స్ వచ్చిందంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. వెంటనే ట్రీట్‌మెంట్ తీసుకోవడం చాలా ముఖ్యం. అయితే, ఈ సమస్యని తగ్గించుకోవడానికి ఇంటి చిట్కాలు కూడా హెల్ప్ చేస్తాయి. తినే ఆహారంలో కూడా కొన్ని మార్పులు చేసుకోవడం మంచిది. కిడ్నీలో రాళ్లు ఉంటే ఈ ఫుడ్‌కి దూరంగా ఉంటే మంచిది.
కిడ్నీలో రాళ్లు ఉన్న వ్యక్తులు రెడ్ మీట్‌కు దూరంగా ఉండాలి, ఎందుకంటే ఇది మూత్రంలో యూరిక్ యాసిడ్ స్థాయిలను పెంచుతుంది, రాళ్లు ఏర్పడడాన్ని ప్రోత్సహిస్తుంది. అదేవిధంగా, స్వీట్లు మరియు కెఫిన్ కూడా పరిమితంగా తీసుకోవాలి. ఎందుకంటే అవి మూత్రంలో కాల్షియం స్థాయిలను పెంచుతాయి, రాళ్ల అభివృద్ధికి మరింత దోహదం చేస్తాయి. ఆల్కహాల్ తీసుకోవడం మానేయాలి, ఎందుకంటే ఇది శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తుంది మరియు కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని పెంచుతుంది. మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నవారు ఉప్పు తీసుకోవడం తగ్గించుకోవాలి. జంక్ ఫుడ్, పిజ్జా, బర్గర్లు మరియు ఇతర అధిక ఉప్పు పదార్థాలకి దూరంగా ఉండడం మంచిది.
సిట్రస్ పండ్లు సాధారణంగా ఆరోగ్యకరమైనవి మరియు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. వాటిలో విటమిన్ సి పుష్కలంగా ఉన్నప్పటికీ, అధిక వినియోగం వలన ఆక్సలేట్ ఉత్పత్తిని పెంచుతుంది, ఇది మూత్రపిండాల్లో రాళ్లకు దారితీస్తుంది. ఇక సోడా రుచికరమైనది కావచ్చు, కానీ ఇది ఇప్పటికే ఉన్న కిడ్నీలో రాళ్లను పెంచుతుంది. అయితే కిడ్నీలో స్టోన్స్ ఉంటే పుష్కలంగా నీరు త్రాగాలి. ప్రతిరోజూ రెండు నుండి మూడు లీటర్ల వరకు నీటితో పాటు ఇతర ద్రవాలు తీసుకోవాలి.కిడ్నీలో రాళ్లతో బాధపడేవారు అరటి పండ్లు,పైనాపిల్,బత్తాయి, దానిమ్మపళ్ళనుతినవచ్చు.బాదం పప్పును తినవచ్చు.వారు కొబ్బరి బోండాలు తాగవచ్చు.బార్లీ బియ్యాన్ని, మొక్కజొన్నలను, ఉలవలనుతినవచ్చు. క్యారెట్లను,కాకరకాయలను, నిమ్మకాయలను ఆహారంలో భాగం చేసుకోవడం మంచిది.అంతే కాదు వారు చేపలను కూడా తినవచ్చు.