Kinova Rice : షుగ‌ర్ ఉన్న‌వారు కూడా ఈ రైస్‌ను క‌డుపునిండా తిన‌వ‌చ్చు.. ఎన్నో ప్ర‌యోజ‌నాలు..!

Kinova Rice : పూర్వ‌కాలంలో మ‌న‌కు చిరు ధాన్యాలు ప్ర‌ధానంగా ఆహారంగా ఉండేవి. త‌రువాత బియ్యం ప్ర‌ధాన ఆహారంగా మారరింది. బియ్యం రాక‌తో మ‌నం చిరు ధాన్యాల‌ను ఆహారంగా తీసుకోవ‌డ‌మే మానేసాము. అయితే నేటి త‌రుణంలో బియ్యంతో వండిన ఆహారాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల అనారోగ్య స‌మ‌స్య‌లు ఎక్కువ‌గా వ‌స్తున్నాయి. అలాగే ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు త‌క్కువ‌గా ఉంటునాయి. దీంతో చాలా మంది మ‌ర‌లా చిరుధాన్యాల‌ను ఆహారంగా తీసుకుంటున్నారు. అయితే కొనుగోలు చేయ‌డానికి ఇబ్బంది లేని వారు చిరుధాన్యా ల‌కంటే మెరుగైన ధాన్యాన్ని తీసుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. అత్య‌ధిక ప్రోటీన్స్ క‌లిగిన ధాన్యాల్లో క్వినోవా ధాన్యం కూడా ఒక‌టి. దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి మ‌రింత మేలు క‌లుగుతుంద‌ని వారు చెబుతున్నారు.

100 గ్రాముల క్వినోవా ధాన్యంలో 14 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. అలాగే ఈ ధాన్యం చాలా తేలిక‌గా జీర్ణం అవుతుంది. ఈ ధాన్యంలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్క‌లంగా ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్లు యాంటీ ఇన్ ప్లామేట‌రీగా ప‌ని చేస్తాయి. ఎదిగే పిల్ల‌ల‌కు ప్రోటీన్ చాలా అవ‌స‌రం. ఒక కిలో బ‌రువుకు 2 గ్రాముల ప్రోటీన్ అవ‌స‌ర‌మ‌వుతుంది. బియ్యంతో వండిన ఆహారాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కు చాలా త‌క్కువ మొత్తంలో ప్రోటీన్ ల‌భిస్తుంది. గ‌ర్భిణీ స్త్రీలు, వృద్దులు ఈ ధాన్యాన్ని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల ప్రోటీన్ లోపం త‌లెత్త‌కుండా ఉంటుంది. అలాగే క్వినోవా ధాన్యంలో 7 గ్రాముల ఫైబ‌ర్ ఉంటుంది. ఇది జీర్ణ‌శ‌క్తిని మెరుగుప‌ర‌చ‌డంలో స‌హాయ‌ప‌డుతుంది. అలాగే ఈ షుగ‌ర్ వ్యాధితో బాధ‌ప‌డే వారు ఈ ధాన్యాన్ని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.

Kinova Rice in telugu know the benefits
Kinova Rice

షుగ‌ర్ వ్యాధి వ‌చ్చే అవ‌కాశాలు ఉన్న వారు అలాగే ఈ వ్యాధి రాకూడ‌దు అనుకున్న వారు ఈ ధాన్యాన్ని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. అలాగే సూక్ష్మ పోష‌కాలు కూడా ఈ ధాన్యంలో అధికంగా ఉన్నాయి. బ‌రువు త‌గ్గాల‌నుకున్న వారు, గుండె జ‌బ్బుల‌తో బాధ‌ప‌డే వారు ఈ ధాన్యాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. క్వినోవా ధాన్యాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల ఎముక‌లు ధృడంగా త‌యార‌వుతాయి. క్యాన్స‌ర్ వ‌చ్చే అవకాశాలు కూడా త‌క్కువ‌గా ఉంటాయి. ఈ విధంగా క్విరోవా ధాన్యం మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంద‌ని ఈ ధాన్యాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి మ‌రింత మేలు క‌లుగుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు.

D

Recent Posts