Lemon Peel Powder : మనం నిమ్మవంటల్లో నిమ్మ రసాన్ని విరివిరిగా ఉపయోగిస్తూ ఉంటాం. నిమ్మరసం మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్న సంగతి మనకు తెలిసిందే. నిమ్మరసంలో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలతో పాటు అనేక ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. నిమ్మరసాన్ని వాడడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చన్న సంగతి మనకు తెలిసిందే. సాధారణంగా మనం నిమ్మరసాన్ని తీసుకున్న తరువాత నిమ్మ తొక్కలను పాడేస్తూ ఉంటాం. కొందరైతే ఈ నిమ్మ తొక్కలను చర్మ శుద్ది కొరకు అలాగే సున్నిపిండి తయారీలో ఉపయోగిస్తూ ఉంటారు. బాహ్యంగా చర్మ సంరక్షణ కొరకు మాత్రమే కాకుండా అంతర్గతంగా తీసుకోవడం వల్ల కూడా మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.
2016 వ సంవత్సరంలో ఇరాన్ దేశ శాస్త్రవేత్తలు నిమ్మ తొక్కలు కూడా మనకు ఎంతో మేలు చేస్తాయని పరిశోధనల ద్వారా వెల్లడించారు. నిమ్మరసాన్ని తీసుకున్న తరువాత నిమ్మతొక్కలను ముక్కలుగా చేసి ఎండబెట్టాలి. తరువాత వీటిని ఒక జార్ లో వేసి మెత్తని పొడిలా చేసుకోవాలి. తరువాత ఈ పొడిని జల్లించగా వచ్చిన మెత్తని పొడిని గాజు సీసాలో వేసుకుని నిల్వ చేసుకోవాలి. ఈ పొడిని పూటకు 2 గ్రాముల మోతాదులో రోజుకు రెండు పూటలా నెల రోజుల పాటు తీసుకోవడం వల్ల రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరాయిడ్స్ 20 శాతం వరకు తగ్గాయని నిపుణులు పరిశోధనల ద్వారా తెలియజేసారు. ఈ నిమ్మ తొక్కల పొడిని నోట్లో వేసుకుని చప్పరించవచ్చు. అలాగే మజ్జిగలో కలుపుకుని తాగవచ్చు.
అన్నంతో మొదటి ముద్దలో కలిపి తీసుకోవచ్చు. ఇలా ఈ నిమ్మ తొక్కల పొడిని ఏ విధంగా తీసుకున్నా కూడా మనం ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు. జన్యుపరంగా గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉన్నవారు, అలాగే కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరాయిడ్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉన్నవారు ముందు నుండే ఈ నిమ్మతొక్కల పొడిని వాడడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని వారు చెబుతున్నారు. ఈ నిమ్మతొక్కల పాటు దీర్ఘకాలం పాటు వాడడం వల్ల మనం ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా రక్తంలో ఉన్న కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించుకోవచ్చని, వీటితో పాటు మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.