Nuts : న‌ట్స్‌ను నాన‌బెట్ట‌కుండా తింటున్నారా.. అయితే జాగ్ర‌త్త‌..!

Nuts : మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌ని మ‌నం ర‌క‌ర‌కాల డ్రై ఫ్రూట్స్ ను ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. శ‌రీరానికి కావ‌ల్సిన పోషకాల‌ను అందించ‌డంలో, గుండెను ఆరోగ్యంగా ఉంచ‌డంలో, ఎముకల‌ను ధృడంగా ఉంచ‌డంలో, జుట్టును మ‌రియు చ‌ర్మాన్ని సంర‌క్షించ‌డంలో, ర‌క్త‌హీన‌త స‌మ‌స్య‌ను త‌గ్గించ‌డంలో, బ‌రువు త‌గ్గ‌డంలో, పోష‌కాహార లోపం త‌లెత్త‌కుండా చేయ‌డంలో ఇలా అనేక ర‌కాలుగా మ‌న‌కు డ్రై ఫ్రూట్స్ మేలు చేస్తాయి. అయితే వీటిని తీసుకునే విష‌యంలో చాలా మంది అనేక ర‌కాల పొర‌పాట్లు చేస్తూ ఉంటారు. డ్రై ఫ్రూట్స్ ను నాన‌బెట్టి మాత్ర‌మే తీసుకోవాలి. అలాగే వీటిని బాగా న‌మిలి తినాలి. డ్రై ఫ్రూట్స్ ను నేరుగా తిన‌డం వ‌ల్ల గ్యాస్, అజీర్తి వంటి స‌మ‌స్య‌లు త‌లెత్తే అవ‌కాశం ఉంది.

డ్రై ఫ్రూట్స్ లో టైనిన్స్, పైలేట్స్ అనే ప‌దార్థాలు ఉంటాయి. ఇవి ప్రేగుల్లో ఎంజైమ్ లు త‌క్కువ‌గా ఉత్ప‌త్తి అయ్యేలా చేస్తాయి. ఎంజైమ్ లు త‌క్కువ‌గా ఉత్ప‌త్తి అవ్వ‌డం వ‌ల్ల జీర్ణ‌క్రియ సాఫీగా సాగ‌దు. దీంతో అజీర్తి, గ్యాస్ వంటి స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి. డ్రై ఫ్రూట్స్ ను నాన‌బెట్టి తీసుకోవ‌డం వ‌ల్ల అలాగే బాగా న‌మిలి తీసుకోవ‌డం వ‌ల్ల ప్రేగుల్లో ఎంజైమ్ ల ఉత్ప‌త్తిపై ఎటువంటి ప్ర‌భావం ఉండ‌దు. గ్యాస్, అజీర్తి వంటి స‌మ‌స్య‌లు త‌లెత్త‌కుండా ఉంటాయి. డ్రై ఫ్రూట్స్ ను బాగా న‌మిలి తిన‌డం వ‌ల్ల ప్రేగుల్లో ఎంజైమ్ లు ఎక్కువ‌గా ఉత్ప‌త్తి అవుతాయ‌ని, వీటిని త‌క్కువ‌గా న‌మిలి తిన‌డం వ‌ల్ల ఎంజైమ్ లు త‌క్కువ‌గా ఉత్పత్తి అవుతాయ‌ని నిపుణులు ప‌రిశోధ‌న‌ల ద్వారా వెల్ల‌డించారు. త‌క్కువ‌గా న‌మిలి తిన‌డం వ‌ల్ల అలాగే డ్రై ఫ్రూట్స్ ను నాన‌బెట్ట‌కుండా తీసుకోవ‌డం వ‌ల్ల పులియ‌డం, గ్యాస్, అజీర్తి వంటి స‌మ‌స్య‌లు ఎక్కువ‌గా వ‌స్తాయ‌ని వారు చెబుతున్నారు.

if you are taking nuts without soaking then know this
Nuts

డ్రై ఫ్రూట్స్ స‌రిగ్గా జీర్ణం కాక‌పోవ‌డం వ‌ల్ల వాటిని తిన్న‌ప్ప‌టికి వాటిలో ఉండే పోష‌కాలు మ‌న శ‌రీరానికి స‌రిగ్గా అంద‌వ‌ని వారు చెబుతున్నారు. నాన‌బెట్టి తీసుకోక‌పోవ‌డం వ‌ల్ల డ్రై ఫ్రూట్స్ వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాలు మ‌న శ‌రీరానికి పూర్తి స్థాయిలో అంద‌వ‌ని వారు తెలియ‌జేస్తున్నారు. డ్రై ఫ్రూట్స్ ను ఉడికించి తీసుకోవ‌డం వ‌ల్ల కూడా గ్యాస్, అజీర్తి వంటి స‌మ‌స్య‌లు రావు. అయితే వీటిని ఉడికించి తీసుకోవ‌డం వ‌ల్ల డ్రై ఫ్రూట్స్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, మైక్రో న్యూట్రియ‌న్స్ అన్నీ న‌శిస్తాయ‌ని నిపుణులు చెబుతున్నారు. క‌నుక డ్రై ఫ్రూట్స్ ను నాన‌బెట్టి తీసుకోవ‌డంతో పాటు బాగా న‌మిలి తినాల‌ని ఇలా తీసుకోవ‌డం వ‌ల్ల గ్యాస్, అజీర్తి వంటి స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయ‌ని అలాగే వాటిలో ఉండే పోష‌కాలు మ‌న‌కు పూర్తి స్థాయిలో అందుతాయ‌ని నిపుణులు చెబుతున్నారు.

D

Recent Posts