Liver Detox : మన శరీరంలో అనేక విధులను నిర్వర్తించే అవయవాల్లో కాలేయం ఒకటి. మనం తీసుకునే ఆహారంలో ఉండే ఎరువులు, పురుగుల మందుల నుండి మనల్ని కాపాడడంలో, మనం తీసుకునే మందుల్లలో ఉండే రసాయనాల నుండి మనల్ని కాపాడడంలో, మనం తీసుకునే కలుషితమైన నీటి నుండి మన శరీరాన్ని కాపాడడంలో కాలేయం మనకు ఎంతో సహాయపడుతుంది. అలాగే శరీరంలో ఉత్పత్తిని అయిన వ్యర్థాలను విడగొట్టి బయటకు పంపించడంలో ఇలా అనేక రకాలుగా కాలేయం మనకు సహాయపడుతుంది. కనుక కాలేయ ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవడం చాలా అవసరం. కాలేయ ఆరోగ్యం ఏ మాత్రం దెబ్బతిన్న మన శరీర ఆరోగ్యం దెబ్బతింటుంది. కానీ నేటి తరుణంలో సగానికి పైగా జనం కాలేయ సమస్యలతో బాధపడుతున్నారు.
ఫ్యాటీ లివర్, ఎన్ లార్జ్డ్ లివర్, హార్డ్న్ లివర్, లివర్ సిండ్రోసిస్ వంటి అనేక కాలేయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ఆల్కాహాల్ తాగే వారితో పాటు తాగని వారికి కూడా కాలేయ సమస్యలు వస్తున్నాయి. అతిగా తినడం, నూనెలో వేయించిన పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం, కొవ్వు పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల వీటిలో ఉండే కొవ్వులన్నీ కూడా కాలేయంలో పేరుకుపోతున్నాయి. దీంతో కాలేయ కణాలల్లో కొవ్వు పేరుకుపోయి కణాల పరిమాణం పెరుగుతుంది. దీంతో ఫ్యాటీ లివర్ సమస్య తలెత్తుతుంది. ఈ సమస్య పెరిగే కొద్ది కాలేయం గట్టి పడిపోతుంది. కాలేయ కణాలు దెబ్బతినడం ప్రారంభమవుతుంది.
కాలేయ పరిమాణం కూడా పెరుగుతుంది. అయితే మందులు వాడడం వల్ల కూడా ఇటువంటి సమస్యల నుండి మనం పూర్తిగా బయటపడలేము. ఎటువంటి మందులు కూడా ఈ సమస్య నుండి పూర్తిగా బయటపడేయలేవని నిపుణులు చెబుతున్నారు. మందులతో పాటు పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకున్నప్పుడే ఈ సమస్య నుండి పూర్తిగా బయటపడగలమని నిపుణులు చెబుతున్నారు. సూక్ష్మ పోషకాలు కలిగిన ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలతో ఉన్న కాలేయమైన తిరిగి సాధారణ స్థితికి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. సూక్ష్మ పోషకాలు ఉడికించిన ఆహారాల్లో ఎక్కువగా ఉండవు. కనుక మనం రోజుకు రెండు పూటలా సహజ సిద్ద ఆహారాలను తీసుకునే ప్రయత్నం చేయాలి.
ఉదయం పూట 250 నుండి 300 ఎమ్ ఎల్ వెజిటేబుల్ జ్యూస్ తాగాలి. ఇది తాగిన అర గంట తరువాత 2 లేదా 3 రకాల మొలకెత్తిన గింజలను తీసుకోవాలి. సాయంత్రం 4 గంటలప్పుడు ఒక ఫ్రూట్ జ్యూస్ ను తీసుకోవాలి. అలాగే సాయంత్రం 7 గంటల లోపు ఆహారాన్ని తీసుకోవాలి. వీటిలో నానబెట్టిన డ్రై ఫ్రూట్స్, ఫ్రూట్స్ ను మాత్రమే తీసుకోవాలి. ఇక మధ్యాహ్నం ఉడికించిన ఆహారాన్ని తీసుకోవచ్చు. ఈ విధంగా ఆహార నియమాలను పాటించడం వల్ల కాలేయ సమస్యలు తగ్గడంతో పాటు మరలా రాకుండా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.కాలేయ సమస్యలు ఉన్నవారు ఈ విధంగా ఆహారాన్ని తీసుకోవడం వల్ల సమస్యల నుండి చాలా సులభంగా బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు.