హెల్త్ టిప్స్

Black Carrot : న‌ల్ల క్యారెట్ల‌ను తింటే ఎన్ని లాభాలో..!

Black Carrot : ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటుంటారు. ఆరోగ్యం బాగుండాలంటే మంచి పోషకాహారాన్ని తీసుకుంటూ ఉండాలి. పండ్లు, కూరగాయల్ని కూడా ఆరోగ్యంగా ఉండడానికి తీసుకోవాలి. ఆరోగ్యకరమైన వాటిల్లో క్యారెట్ కూడా ఒకటి. చాలా మంది క్యారెట్ ని ఎక్కువగా తినడానికి ఇష్టపడతారు. భారతదేశం అంతా కూడా క్యారెట్ల సాగు చేస్తారు. క్యారెట్లలో పోషక పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. విటమిన్ ఏ, విటమిన్ ఈ, విటమిన్ సి ఇందులో ఎక్కువ ఉంటాయి.

క్యారెట్ ని తీసుకోవడం వలన రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. క్యారెట్ లో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. జీర్ణవ్యవస్థ సక్రమంగా ఉండేటట్టు క్యారెట్ చూస్తుంది. మలబద్ధకం సమస్య ఏర్పడకుండా కూడా క్యారెట్ చేయగలదు. మార్కెట్లో క్యారెట్ కి డిమాండ్ ఎప్పుడూ ఎక్కువగా ఉంటుంది. అయితే సాధారణ క్యారెట్ కాకుండా బ్లాక్ క్యారెట్ వలన కూడా పోషకాలు బాగా అందుతాయి.

many wonderful health benefits of black carrots

క్యారెట్లలో చాలా రకాలు ఉన్నాయి. వందల రకాల క్యారెట్లు వివిధ రంగుల్లో అందుబాటులో ఉంటున్నాయి. నల్ల క్యారెట్ గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. నల్ల క్యారెట్ ను సలాడ్, పుడ్డింగ్ వంటి వాటికి వాడతారు. దీనిని ఔషధంగా కూడా ఉపయోగిస్తారు. నల్ల క్యారెట్లని తీసుకుంటే క్యాన్సర్ రాకుండా ఉంటుంది. క్యాన్సర్ కణాలతో ఇది పోరాడుతుంది.

వీటిల్లోని యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్రీ రాడికల్స్ ని నాశనం చేస్తాయి. నల్ల క్యారెట్ లని తీసుకుంటే శక్తి కూడా బాగా పెరుగుతుంది. నల్ల క్యారెట్లని తీసుకుంటే శరీరంలో వాపు తగ్గుతుంది. నల్ల క్యారెట్స్ నాడీ సంబంధిత వ్యాధుల్ని నివారిస్తాయి. నల్ల క్యారెట్ లని తీసుకోవడం వలన చురుకుదనం పెరుగుతుంది. ఇలా నల్ల క్యారెట్ లతో అనేక లాభాలు పొందొచ్చు. అనేక రకాల అనారోగ్య సమస్యల‌ బారిన పడకుండా దూరంగా ఉండొచ్చు.

Admin

Recent Posts