చిట్కాలు

Teeth Whitening : గార ప‌ట్టిన దంతాల‌ను సైతం తెల్ల‌గా మార్చ‌గ‌ల‌దు.. ఇలా చేయాలి..!

Teeth Whitening : సాధారణంగా మనం నవ్వినా, మాట్లాడిన మన పళ్ళు ఇతరులకు కనబడుతుంటాయి. అయితే పళ్ళు పచ్చగా ఉన్నవారు నలుగురిలో మాట్లాడాలన్నా.. నవ్వాలన్న ఎంతో ఇబ్బంది పడుతుంటారు. ఈ విధంగా పసుపుపచ్చ పళ్ళతో బాధపడేవారు స్ట్రాబెర్రీతో ఇలా చేస్తే అందమైన నల్లని నిగనిగలాడే పళ్ళను మీ సొంతం చేసుకోవచ్చు. మరి స్ట్రాబెర్రీతో ఏం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం..

తినడానికి తీపి పులుపు రుచిని కలిగి ఉండే స్ట్రాబెర్రీలో ఎల్లాజిక్ ఆమ్లం, ఆంథోసైనిన్ ,యాంటీఆక్సిడెంట్లు స్టాబెర్రీలో అధికంగా ఉంటాయి. వీటితోపాటు స్ట్రాబెర్రీలో మాలిక్ ఆమ్లం ఉంటుంది. ఇది దంతాలను శుభ్రపరచడానికి,నోటిలో ఉన్న సూక్ష్మక్రిములను నాశనం చేయడానికి దోహదపడుతుంది.గార పట్టిన పళ్ళ పై స్ట్రాబెర్రీ ముక్కను తీసుకొని బాగా రుద్దడం వల్ల పళ్ళ పై ఉన్నటువంటి గార, పసుపుపచ్చని మరకలు తొలగిపోతాయి. తరచూ ఈ విధంగా చేయటం వల్ల ఎంతో అందమైన తెల్లని నిగనిగలాడే పళ్ళను మీ సొంతం చేసుకోవచ్చు.

whiten your teeth naturally with these tips

స్ట్రాబెరీలో ఉన్నటువంటి యాంటీఆక్సిడెంట్లు సూర్యకిరణాల నుంచి చర్మాన్ని రక్షిస్తాయి. ఈ స్ట్రాబెర్రీ ముక్కలను పడుకునే ముందు కళ్లపై 15 నిమిషాలపాటు వేసుకోవటం వల్ల కళ్ళ కింద ఉన్నటువంటి నల్లటి మచ్చలు, వలయాలు తొలగిపోయి అందమైన ముఖ కాంతిని పొందవచ్చు. అదేవిధంగా పాదాలు పగుళ్ళతో బాధపడేవారు ముందుగా గోరువెచ్చని నీటిలో పాదాలను శుభ్రం చేసుకుని ఆ తర్వాత స్ట్రాబెర్రీ మిశ్రమాన్ని పాదాలపై రాసి బాగా మర్దన చేయడం వల్ల పాదాల పగుళ్ల నుంచి విముక్తి పొందవచ్చు.

ఇక దంతాల‌ను తెల్ల‌గా చేసుకునేందుకు మ‌రో ట్రిక్‌ను ట్రై చేయ‌వ‌చ్చు. అర‌చేతిలో కాస్త ప‌సుపు, కొబ్బ‌రినూనె, ఉప్పు వేసి బాగా క‌ల‌పాలి. ఈ మిశ్ర‌మాన్ని సాఫ్ట్ టూత్ బ్ర‌ష్‌తో తీసుకుని దంతాల‌పై రుద్దాలి. 5 నిమిషాలు ఆగాక నోరు, దంతాల‌ను శుభ్రం చేసుకోవాలి. ఇలా వారంలో క‌నీసం 2 సార్లు చేయ‌డం వ‌ల్ల దంతాలు తెల్ల‌గా మారి మెరుస్తాయి. దంతాల‌పై ఉండే ప‌సుపుద‌నం, గార తొల‌గిపోతాయి.

Admin

Recent Posts