హెల్త్ టిప్స్

Mushrooms : పుట్ట గొడుగుల‌ను తింటే.. డిప్రెష‌న్, మాన‌సిక ఒత్తిడి.. హుష్ కాకి..!

Mushrooms : పుట్ట గొడుగుల‌ను మ‌న‌లో చాలా మంది ఇష్టంగా తింటారు. వీటిల్లో అనేక ర‌కాల విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ ఉంటాయి. కొలెస్ట్రాల్ అస్స‌లే ఉండ‌దు. అందువ‌ల్ల పుట్ట గొడుగుల‌ను సూపర్ ఫుడ్‌గా పిలుస్తారు. వీటిల్లో యాంటీ బాక్టీరియ‌ల్ ల‌క్ష‌ణాలు ఉంటాయి క‌నుక అనేక వ్యాధులు రాకుండా చూసుకోవ‌చ్చు. అలాగే పుట్ట‌గొడుగుల్లో ఉండే యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు మ‌న‌కు అనేక ర‌కాల ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి.

అయితే పుట్ట‌గొడుగుల‌ను తిన‌డం వ‌ల్ల డిప్రెష‌న్‌తోపాటు మాన‌సిక ఒత్తిడి కూడా త‌గ్గుతుంద‌ని సైంటిస్టులు చేప‌ట్టిన అధ్య‌య‌నాల్లో వెల్ల‌డైంది. ఈ మేర‌కు పెన్ స్టేట్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన ప‌రిశోధ‌కులు 2005 నుంచి 2016 వ‌ర‌కు 24వేల మందికి చెందిన వివ‌రాల‌ను సేక‌రించి క్షుణ్ణంగా ప‌రిశీలించారు. దీంతో తేలిందేమిటంటే..

many wonderful health benefits of taking mushrooms

పుట్ట‌గొడుగుల‌ను తిన‌డం వ‌ల్ల డిప్రెష‌న్‌ను త‌గ్గించుకోవ‌చ్చ‌ని చెబుతున్నారు. దీంతోపాటు ఇత‌ర మాన‌సిక స‌మ‌స్య‌లు తగ్గుతాయ‌ని, ఒత్తిడి త‌గ్గుతుంద‌ని చెబుతున్నారు.

ఇక పుట్ట గొడుగుల‌ను తిన‌డం వ‌ల్ల అనేక పోష‌కాలు ల‌భిస్తాయి. ముఖ్యంగా విట‌మిన్ డి అందుతుంది. దీంతో ఎముక‌లు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి. రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. అలాగే ప‌లు ర‌కాల బి విట‌మిన్లు అందుతాయి. అందువ‌ల్ల పుట్ట గొడుగుల‌ను త‌ర‌చూ తినాల‌ని సైంటిస్టులు చెబుతున్నారు.

Admin

Recent Posts