ఆధ్యాత్మికం

శ్రీవారిని వడ్డీకాసుల వాడని ఎందుకు పిలుస్తారో తెలుసా?

మనదేశంలో తిరుమలలో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. ప్రతిరోజు కొన్ని లక్షల సంఖ్యలో భక్తులు స్వామివారి దర్శనం చేసుకుంటారు. అదేవిధంగా భక్తులు పెద్ద ఎత్తున స్వామివారికి కానుకలను కూడా సమర్పిస్తుంటారు. ఈ క్రమంలోనే స్వామి వారికి రోజుకు ఆదాయం కోట్లలో వస్తుంది. ఏడు కొండల వారి దర్శనం చేసుకుంటే సర్వపాపాలు, కష్టాలు, ఆపదలు తొలగిపోతాయి కనుక స్వామి వారిని ఆపదమొక్కులవాడు అని కూడా పిలుస్తారు.

వెంకటేశ్వర స్వామి వారిని ఏడుకొండల వాడిని, ఆపదమొక్కులవాడని,వడ్డీ కాసుల వాడని పిలుస్తారు. అయితే స్వామివారు ఆపదలను తీరుస్తాడు కనుక ఆపదమొక్కులవాడని, ఏడుకొండలపై వెలిసినాడు కనుక ఏడుకొండలవాడని పిలుస్తారు. అయితే స్వామివారిని వడ్డీ కాసుల వాడిని ఎందుకు పిలుస్తారో తెలుసా…

do you know why lord venkateshwara is called vaddikasula vadu

పురాణాల ప్రకారం శ్రీవారు పద్మావతి దేవిని వివాహం చేసుకోవడానికి భూలోకం వచ్చారు. ఈ క్రమంలోనే లక్ష్మీదేవిని వైకుంఠంలో వదిలి రావడంతో అతనికి పద్మావతిని పెళ్లి చేసుకోవడానికి సరిపడే డబ్బులు లేక పోవడంతో కుబేరుడు వద్ద అప్పుగా తీసుకుని వివాహం చేసుకున్నారు.అయితే కుబేరుని అప్పు సంవత్సరంలో గా తిరిగి చెల్లిస్తానన్న శ్రీవారు సంవత్సరానికి కేవలం వడ్డీ మాత్రమే చెల్లించారు. అప్పటి నుంచి ప్రతి ఏడు వడ్డీ మాత్రమే చెల్లించడం వల్ల అప్పు అలాగే పెరుగుతూ వచ్చింది. ఈ విధంగా స్వామివారు కేవలం వడ్డీ మాత్రమే చెల్లించడం వల్ల స్వామివారికి వడ్డీ కాసులవాడనే పేరు వచ్చింది.

Admin

Recent Posts