Milk With Tulsi : పాలు, తుల‌సి ఆకులు.. వీటిని క‌లిపి ఇలా తీసుకోండి.. ఎంతో మేలు జ‌రుగుతుంది..!

Milk With Tulsi : మ‌నం తుల‌సి చెట్టును ప‌విత్రంగా భావించి పూజ‌లు చేస్తూ ఉంటాము. అలాగే ఔష‌ధంగా ఉప‌యోగిస్తూ ఉంటాము. తుల‌సి ఆకుల‌ను ఉప‌యోగించి మ‌నం వివిధ ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను దూరం చేసుకోవ‌చ్చ‌న్న సంగ‌తి కూడా మ‌న‌కు తెలిసిందే. తుల‌సి ఆకుల‌ను నేరుగా న‌మ‌ల‌డం లేదా వాటితో క‌షాయాన్ని త‌యారు చేసుకుని తాగ‌డం వంటివి చేస్తూ ఉంటాము. అయితే తుల‌సి ఆకుల‌ను ఇలా నేరుగా తీసుకోవ‌డానికి బ‌దులుగా పాల‌తో క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం మ‌రిన్ని ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. పాల‌ను మ‌నం ప్ర‌తిరోజూ ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. పాలు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల కూడా మ‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజనాల‌ను పొంద‌వ‌చ్చ‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే.

ఈ పాల‌ను తుల‌సి ఆకుల‌తో క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం రెట్టింపు ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. పాల‌ను, తుల‌సి ఆకుల‌ను క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కు క‌లిగే ప్ర‌యోజ‌నాలు ఏమిటి… అలాగే ఈ తుల‌సి పాల‌ను ఎలా త‌యారు చేసుకోవాలి..అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ తుల‌సి పాల‌ను త‌యారు చేసుకోవ‌డానికి గానూ ఒక గిన్నెలో ఒక గ్లాస్ పాల‌ను పోసి వేడి చేయాలి. పాలు మ‌రిగిన త‌రువాత శుభ్రంగా క‌డిగిన 4 తుల‌సి ఆకులు వేసి క‌ల‌పాలి. ఈ పాల‌ను మ‌రో నిమిషం పాటు మ‌రిగించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇవి గోరు వెచ్చ‌గా అయిన పాల‌ను తాగుతూ తుల‌సి ఆకుల‌ను న‌మిలి తినాలి. ఇలా తుల‌సి ఆకుల‌ను, పాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో ఉష్ణోగ్ర‌త‌లు త‌గ్గడంతో పాటు ఫ్లూ ల‌క్ష‌ణాలు కూడా తగ్గుతాయి. ద‌గ్గు, జ‌లుబు వంటి స‌మస్య‌ల నుండి ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది. అంతేకాకుండా ఈ పాల‌ను తాగ‌డం వ‌ల్ల గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది.

Milk With Tulsi amazing health benefits
Milk With Tulsi

నాడీ వ్య‌వ‌స్థ ప‌నితీరు మెరుగుప‌డుతుంది. ఒత్తిడి, ఆందోళ‌న వంటి స‌మ‌స్య‌ల నుండి ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది. హార్మోన్ల అస‌మ‌తుల్య‌త వంటి స‌మ‌స్యలు త‌గ్గుతాయి. త‌ల‌నొప్పి కూడా త‌గ్గుతుంది. అలాగే శ‌రీరంలో ఇన్ ప్లామేష‌న్ కూడా త‌గ్గుతుంది. మూత్ర‌పిండాల్లో రాళ్లు స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు ఈ పాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. మ‌న ఆరోగ్యానికి మేలు చేసేవే అయిన‌ప్ప‌టికి ఈపాల‌ను త‌గిన మోతాదులో మాత్ర‌మే తీసుకోవాలి. ఈ పాల‌ను ఎక్కువ‌గా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం వివిధ ర‌కాల దుష్ప్ర‌భావాల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. గ‌ర్భిణీ స్త్రీలు ఈ పాల‌ను తాగ‌క‌పోవడ‌మే మంచిది. అలాగే ర‌క్త‌స్రావం స‌మ‌స్య‌లు ఉన్న‌వారు కూడా ఈ పాల‌ను తాగ‌కూడ‌దు. ఈ విధంగా తుల‌సి ఆకుల‌ను, పాల‌ను క‌లిపి త‌గిన మోతాదులో తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

Share
D

Recent Posts