Morning Mistakes : ఉద‌యం 9 గంట‌ల లోపు చాలా మంది చేసే మిస్టేక్స్ ఇవే..!

Morning Mistakes : ఉద‌యం నిద్ర‌లేవడం కొంత మందికి చాలా క‌ష్టం. అత్య‌వ‌స‌ర‌మైన‌ప్పుడు అలార‌మ్ పెట్టుకున్నా అది మోగినా మ‌రో ప‌ది నిమిషాలు, ఐదు నిమిషాలు అంటూ అలారాన్ని మారుస్తూ కునుకు తీస్తూ ఉంటారు. ఈ అల‌వాటు అస్స‌లు మంచిది కాద‌ట‌. ఇదే కాదు ఇలాంటివి చాలా ఉన్నాయి. అస‌లు మ‌నం ఉద‌యం లేచిన ద‌గ్గ‌రి నుండి చిన్న చిన్న పొర‌పాట్ల‌ను చాలానే చేస్తూ ఉంటాం. ఉద‌యం పూట మ‌నం చేస్తున్న పొర‌పాట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. క‌ళ్లు తెరిచి తెర‌వ‌గానే నేల మీ కాళ్లు పెట్ట‌డం వ‌ల్ల వెన్న‌ముక కండ‌రాలు దెబ్బ‌తింటాయి. అలాగే ర‌క్తం కాళ్ల‌కు చేరిపోయి నొప్పికి కార‌ణ‌మ‌వ‌తుంది. క‌నుక క‌ళ్లు తెరిచిన త‌రువాత కొద్దిగా విశ్రాంతి తీసుకోవాలి.

నిద్ర లేచిన వెంట‌నే శ‌రీరాన్ని అన్నీ దిశ‌ల్లో వంచాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల కండ‌రాలు సాగుతాయి. ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ శ‌రీరం అంతా సాఫీగా జ‌రుగుతుందని నిపుణులు చెబుతున్నారు. నిద్ర లేచేట‌ప్పుడు చాలా మంది హ‌డావిడిగా లేస్తారు. పిల్ల‌ల‌ను స్కూల్ కు పంపాలి, అల్పాహారం త‌యారు చేయాల‌ని పరుగులు పెడుతుంటారు. బెడ్ రూమ్ నుండి నేరుగా వంట‌గ‌దిలోకి ప‌రిగెడుతుంటారు. ఇదే చాలా మంది చేస్తున్న అతి పెద్ద పొర‌పాటు. ఉద‌యం నిద్ర‌లేచిన కూడా శ‌రీరానికి విశ్రాంతి అవ‌స‌రమ‌ట‌. అవ‌స‌ర‌మైతే ఉద‌యం త్వ‌ర‌గా లేవాలి కానీ హ‌డావుడిగా నిద్ర‌లేవ‌కూడ‌దు. నిద్ర‌లేవ‌గానే ఎవ‌రి కోసం వారు కొంత స‌మ‌యాన్న కేటాయించాలి.

Morning Mistakes we are doing many times know them
Morning Mistakes

వాకింగ్, యోగా, బ్రీతింగ్ ఎక్స‌సైజ్, రీడింగ్ వంటివి ఏదో ఒక‌టి చేయాల‌ట‌. అలాగే ఏ స‌మ‌యానికి లేస్తామో ఆ స‌మ‌యానికే అలారాన్ని పెట్టుకోవాలి. అలారం మోగిన వెంట‌నే నిద్ర‌లేచేలా మెద‌డును సిద్దంగా ఉంచాలి. అలాగే అలారం మోగిన వెంట‌నే లేచి బెడ్ పైనే శ‌రీరాన్ని సాగ‌దీసి గ‌ట్టిగా శ్వాస తీసుకుని వ‌దిలి రోజును ప్రారంభించాల‌ట‌. వ్యాయామం చేయ‌డానికి ఉద‌యం స‌రైన స‌మ‌యం. కానీ కొంద‌రు ఉద‌యం నిద్ర‌లేవ‌డానికి బ‌ద్ద‌కంగా అనిపించి సాయంత్రం పూట వ్యాయామం చేస్తారు. కానీ ఇది స‌రైన ప‌ద్ద‌తి కాద‌ట‌. ఉద‌యం లేవ‌గానే వ్యాయామం చేయ‌డం వ‌ల్ల రోజంతా ఉత్సాహంగా, ఆరోగ్య‌వంతంగా ఉంటార‌ట‌. ప‌నుల్లో నిమ‌గ్న‌మై కొంద‌రు అల్పామారం చేయ‌డం మానేస్తూ ఉంటారు. కానీ నిద్ర లేచిన త‌రువాత శ‌రీరంలో మెటాబాలిజం చాలా నెమ్మ‌దిగా ఉంటుంది.

ఈ మెటబాలిజం వేగంగా ప‌ని చేయాలంటే దానికి శ‌క్తి అవ‌స‌రం. అలాగే ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు త‌క్కువ‌గా ఉంటాయి. ఇవి అన్నీ కూడా స‌రైన దారిలోకి రావాలంటే బ్రేక్ ఫాస్ట్ తిన‌డం చాలా అవ‌స‌రం. నిద్ర‌లేచిన త‌రువాత న‌ల‌భై నిమిషాల నుండి గంట‌లోపు ఏదో ఒక‌టి తీసుకోవాలి. పండ్లు, కోడిగుడ్లు, న‌ట్స్ ఇలా ఏదో ఒక‌టి తీసుకోవాలి. అలాగే ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపున రెండు నుండి మూడు గ్లాసుల నీటిని తాగాలి. అలాగే ఉద‌యం పూట హ‌డావుడిగా బ్రేక్ ఫాస్ట్ ను చేయ‌కూడ‌దు. అలాగే హ‌డావుడిగా రోజును ప్రారంభించి ఆఫీస్ ల‌కు వెళితే మ‌ధ్యానానికే శ‌క్తి అయిపోవ‌డం ఖాయ‌మ‌ని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. క‌నుక ఉద‌యం లేచిన త‌రువాత ఈ నియ‌మాల‌ను పాటించ‌డం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉండ‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

D

Recent Posts