హెల్త్ టిప్స్

చేతి వెళ్లు మీ గుండె ఆరోగ్యాన్ని చెప్పేస్తాయి ఎలాగో తెలుసా..

మనలో చాల మందికి చిన్న ఆరోగ్య సమస్య వచ్చిన చాలా కంగారు పడిపోతుంటారు. వాతావరణ మార్పు వలన వచ్చే జలుబు,దగ్గు వంటి వాటికి కూడా విపరీతమైన టెన్షన్ పడుతుంటారు. చిన్న చిన్న సమస్యలకి డాక్టర్ల దగ్గరకి పరుగులు తీసే కొందరు పెద్ద పెద్ద మార్పులను గమనించుకోరు. ఇలాంటి వారిని దృష్టిలో ఉంచుకొనే కొంతమంది శాస్త్రవేత్తలు కొన్ని పరిశోధనలు చేసి, మన శరీరం లో వచ్చే స్వల్ప సంకేతాల ఆధారంగా గుండెకు రాబోయే జబ్బులను కూడా గుర్తిచవచ్చని చెబుతున్నారు. ఇంతకీ ఆ సంకేతాలు ఏంటో తెలుసుకుందామా…

మన చేతి వేళ్ళని చూసి మన గుండె కి రాబోయే జబ్బులని ముందుగానే గుర్తించవట. ఉంగరం వేలు కంటే చూపుడు వేలు పెద్దగా ఉన్నవాళ్ళలో గుండె జబ్బులు త్వరగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అంటున్నారు నిపుణులు. ఇందుకుగాను గతంలో హార్ట్ ఎటాక్ వచ్చిన 35 నుంచీ 80 ఏళ్ళ వయసు ఉన్న సుమారు 151 మందిపై ఈ పరిశోధన చేయగా ఈ విషయం వెలుగులోకి వచ్చిందని తెలిపారు.

our fingers show our heart health know how

ఉంగరం వేలు తో చూపుడు వేలు సమానంగా ఉన్న వాళ్ళలో గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయని కూడా ఈ పరిశోధనలో తేలిందని యూనివర్సిటీ అఫ్ లివర్ పూల్ కి చెందిన శాస్త్రవేత్తలు వెల్లడించారు. అలాగే క్షణం తీరిక లేకుండా ఉద్యోగంలో గడిపే వారికి మానసిక ఒత్తిడితో గుండె జబ్బులు వస్తున్నాయని తెలిపారు.

Admin

Recent Posts