పోష‌కాహారం

డ్రాగన్ ఫ్రూట్స్‌కి ఆ పేరెలా వచ్చిందో తెలుసా..?

డ్రాగన్ ఫ్రూట్ ను పిటాయ లేదా స్ట్రాబెర్రీ పియర్ గా లేదా అన్యదేశ ఉష్ణమండల పండుగా పిలుస్తుంటారు. వివిధ రకాల పోషకాలతో పాటుగా, సంభావ్య ప్రయోజనాలను కలుగచేస్తుంది. ఇది చూడ‌డానికి పింక్ క‌ల‌ర్‌లో ఉంటుంది. డ్రాగన్ ఫ్రూట్‌కు ఈ పేరు ఎలా వ‌చ్చిందో చాలా మందికి తెలియ‌దు. వాస్త‌వానికి డ్రాగన్ అనేది చైనాలో పవిత్రమైన జంతువు. అది తన నోటి ద్వారా అగ్నిజ్వాలలు రగిలిస్తూ… శత్రువుల్ని సంహరిస్తుందనీ, అలాంటి డ్రాగన్స్ ఇప్పటికీ ఉన్నాయని చైనీయులు నమ్ముతారు. మ‌రి ఈ జంతువుకు.. ఈ ఫూట్‌కు లింక్ ఏంటో ఇప్పుడు చూద్దాం.. ఎన్ని పండ్లు ఉన్నా డ్రాగన్ పండ్లను ఇట్టే గుర్తించగలం.

గులాబీ రంగులో ఉండే ఈ పండుకి చుట్టూ ఉన్న రేకులు పసుపు, పచ్చ రంగులో ఉంటాయి. మరి ఆ పేరును ఈ పండ్లకు ఎందుకు పెట్టారంటే, వీటి ఆకర్షణీయమైన రంగు, రూపురేఖల వల్లే దీనికి ఈ పేరు వ‌చ్చింది. ఇది దక్షిణ అమెరికాలో పుట్టింది. తూర్పు ఆసియాకు విస్తరించింది. థాయ్‌లాండ్, వియత్నాం ప్రజలకు ఈ పండ్లంటే విపరీతమైన ఇష్టం. డ్రాగన్ పండ్లలో విటమిన్ C, E పెద్ద మొత్తంలో ఉంటాయి. అలాగే ఐరన్, మెగ్నీషియం కూడా ఎక్కువే. అందువల్ల ఈ పండ్లు ఎంత తింటే అంత చురుకుగా మారతారు.

do you know how dragon fruit got that name

డ్రాగన్ ఫ్రూట్ శరీరంలోని చెడు కొవ్వు పదార్థాలను, మంచి కొవ్వు పదార్థాలతో బదిలీ చేసి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇవి కొద్దిగా పుల్లగా, కొద్దిగా తీపిగా ఉంటాయి. మరీ ఎక్కువ తీపిదనం ఉండవు. కానీ.. పోష‌కాలు మాత్రం అధికం. ఇక డ్రాగన్ ఫ్రూట్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ లు, మీ చర్మాన్ని బిగుతుగా మరియు యవ్వనంగా ఉంచుతాయి. . డ్రాగన్‌ ఫ్రూట్‌లో ఫైబర్‌ పుష్కలంగా దొరుకుతుంది. ఇది జీర్ణ సమస్యలను పోగొడుతుంది. గ్యాస్‌, అసిడిటీ, మలబద్దకం తగ్గుతాయి. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది.

Admin

Recent Posts