Pani Puri : పానీపూరీ తింటున్నారా.. అయితే త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యం.. లేదంటే ప్రాణాల‌కే ప్ర‌మాదం..

Pani Puri : మ‌న‌కు సాయంత్రం పూట రోడ్ల ప‌క్క‌న బండ్ల మీద ల‌భించే వివిధ రకాల చిరుతిళ్ల‌ల్లో పానీపూరీ కూడా ఒక‌టి. పానీపూరీ చాలా రుచిగా ఉంటుంది. పిల్ల‌లు, పెద్ద‌లు అనే తేడా లేకుండా అంద‌రూ దీనిని ఇష్టంగా తింటూ ఉంటారు. దీనిని ఇష్ట‌ప‌డని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. అయితే నేటి త‌రుణంలో వ్యాపారులు స్వ‌లాభం కోసం అన్నింటిని క‌ల్తీ చేస్తున్నారు. చాలా సార్లు పానీపూరీ విష‌యంలో కూడా ఇలాంటి విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి. పానీపూరీని త‌యారు చేసే వారు న‌కిలీ మ‌సాలాల‌ను వాడుతున్నార‌ని అలాగే పానీపూరీలో వేసే నీరు కూడా మురికి నీరు అని క‌లుషిత‌మైన నీటిని పానీపూరీలో ఉప‌యోగిస్తున్నార‌ని అలాగే పూరీ త‌యారీకి వాడే పిండిని కాళ్ల‌తో తొక్కి త‌యారు చేస్తున్నారని ఇలా అనేక ర‌కాల విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి. వీటికి సంబంధించిన వార్త‌ల‌ను ఫోటోలు, వీడియోల రూపంలో ఇప్ప‌టికి మ‌నం సోష‌ల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం.

అలాగే పానీపూరీకి సంబంధించిన మ‌రో విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. పానీపూరీ నీళ్ల‌ల్లో యాసిడ్ క‌లిపి అమ్ముతున్నార‌ని తాజాగా వెలుగులోకి వ‌చ్చింది. నీటిలో యాసిడ్ క‌లప‌డం వ‌ల్ల పానీపూరీ రుచి పెరుగుతుంద‌ని దీంతో త‌రుచూ ప్ర‌జ‌లు పానీపూరీని తిన‌డానికి త‌మ్మ వ‌ద్ద‌కే వ‌స్తారు అనే దురుద్దేశంతో వ్యాపారులు ఇలా చేస్తున్నారని అధికారులు చెబుతున్నారు. అలాగే మ‌నం తినే పానీపూరీ నీటిలో యాసిడ్ క‌లిపారా లేదా అనే విష‌యాన్ని కూడా చాలా సుల‌భంగా గుర్తించ‌వ‌చ్చ‌ని వారు చెబుతున్నారు. పానీపూరీలో నీటి రంగు చాలా తేలిక‌గా మారితే వారు నీటిలో యాసిడ్ క‌ల‌పార‌ని అర్థం. అలాగే స్టీల్ ప్లేట్ లో గ‌నుక పానీపూరీని ఇస్తే ప్లేట్ పై తెల్ల‌టి గుర్తులు ఏర్ప‌డతాయి. దీనిని బ‌ట్టి కూడా నీటిలో యాసిడ్ క‌ల‌పార‌ని మ‌నం అర్థం చేసుకోవ‌చ్చు. అంతేకాకుండా యాసిడ్ క‌లిపిన పానీపూరీని తిన‌ప్పుడు మ‌న దంతాల‌పై ఒక‌లాంటి పొర ఏర్ప‌డుతుంది. అలాగే గొంతులో చికాకు, మంట‌, క‌డుపులో నొప్పి వంటి స‌మ‌స్య‌లు కూడా త‌లెత్తుతాయి.

Pani Puri important facts to know or else your health will be in danger
Pani Puri

క‌నుక ఇటువంటి ల‌క్ష‌ణాల‌ను ఎవ‌రైనా గుర్తిస్తే వెంట‌నే పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో పాటు ప్ర‌జ‌ల‌ను కూడా అప్ర‌మ‌త్తం చేయ‌డం మంచిది. వీటితో పాటు రుచిగా ఉంది క‌దా అని ఎక్క‌డ‌ప‌డితే అక్క‌డ ఇటువంటి చిరుతిళ్ల‌ను తీసుకోవ‌డం మంచిది కాద‌ని ఇలాంటి నాణ్య‌త‌లేని చిరుతిళ్ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను ఎదదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఇలాంటి చిరుతిళ్ల‌ను పిల్ల‌ల‌కు ఇవ్వ‌డం వ‌ల్ల వారి భ‌విష్య‌త్తును మ‌నం నాశ‌నం చేసిన వాళ్లం అవుతామ‌ని క‌నుక వీలైనంత వ‌ర‌కు ఇంట్లోనే వీటిని త‌యారు చేసి తీసుకోవ‌డం మంచిద‌ని వారు చెబుతున్నారు.

Share
D

Recent Posts