Pink Color Guava Benefits : మనం జామకాయలను కూడా ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాము. జామకాయలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అలాగే ఇవి మనకు తక్కువ ధరలో అన్ని వేళలా లభిస్తాయి. జామకాయలను చాలా మంది ఇష్టంగా తింటారు. జామకాయలను తీసుకోవడం వల్ల మనం అనేక అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చని నిపుణులు కూడా చెబుతూ ఉంటారు. అదే విధంగా జామ కాయలల్లో చాలా రకాలు ఉంటాయి. వాటిలో పింక్ జామ కాయ కూడా ఒకటి. ఈ జామకాయ లోపల పింక్ రంగులో ఉంటుంది. సాధారణ జామకాయల వలె ఈ పింక్ రంగులో ఉండే జామకాయలు కూడా మన ఆరోగ్యానికి మేలు చేస్తాయని వీటిని కూడా ఆహారంలో భాగంగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. పింక్ రంగులో ఉండే ఈ జామకాయల్లో కూడా అనేక రకాల పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి.
పింక్ రంగులో ఉండే జామకాయల్లో విటమిన్ సి, పొటాషియం, ఫైబర్, విటమిన్ ఎ, బి1, బి2, బి3, ఇ వంటి ఎన్నో పోషకాలు ఉన్నాయి. 100 గ్రాముల పింక్ జామకాయలను తీసుకోవడం వల్ల మనకు రోజు వారి అవసరాల్లో 20 శాతం ఫైబర్ లభిస్తుంది. సాధారణ జామకాయల్లో కంటే పింక్ రంగులో ఉండే జామకాయలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. వీటిలో ఉండే ఫైబర్ శరీరంలో చెడుకొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా ఈ జామకాయల్లో ఉండే విటమిన్ సి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో, నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అదే విధంగా పింక్ జామకాయల్లో బీటా కెరోటీన్, లైకోపిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఫ్రీరాడికల్స్ నుండి చర్మాన్ని కాపాడడంలో సహాయపడతాయి. అలాగే పింక్ జామకాయలను తీసుకోవడం వల్ల శరీర బరువు తగ్గుతుంది.
వీటిలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. కనుక వీటిని తీసుకోవడం వల్ల సులభంగా బరువు తగ్గవచ్చు. అలాగే ఈ జామకాయల్లో ఉండే పొటాషియం రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. వీటిని తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. అంతేకాకుండా ఈ జామకాయలను తీసుకోవడం వల్ల షుగర్ అదుపులో ఉంటుంది. ఈ జామకాయల యొక్క గ్లైసెమిక్ ఇండెక్స్ 24. కనుక వీటిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. అలాగే ఈ పింక్ జామకాయల్లో ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి9 ఎక్కువగా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల గర్భిణీ స్త్రీలకు ఎంతో మేలు కలుగుతుంది. గర్భిణీ స్త్రీలు ఈ జామకాయలను తీసుకోవడం వల్ల గర్భస్త శిశువు ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే వీటిని తీసుకోవడం వల్ల మెదడుఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. వీటిలో ఉండే విటమిన్ బి3, బి6 మెదడుకు రక్తప్రసరణను పెంచి మెదడు పనితీరును మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఈ విధంగా పింక్ జామకాయలు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ఇతర జామకాయల వలె వీటిని కూడా ఆహారంగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.