Pregnancy Foods : పుట్ట‌బోయే బిడ్డ బ‌లంగా ఉండాలంటే.. గ‌ర్భిణీలు వీటిని తీసుకోవాలి..!

Pregnancy Foods : పుట్టుక‌తోనే ఎవ‌రైనా స‌రే బ‌లంగా ఉంటే త‌రువాతి కాలంలో వారికి ఎలాంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. అలాగే ఎదుగుద‌ల‌లో కూడా ఎలాంటి లోపం ఉండ‌దు. దీంతోపాటు శ‌క్తి సామ‌ర్థ్యాలు పెరుగుతాయి. అయితే పుట్ట‌బోయే బిడ్డ బలంగా ఉండాలంటే.. వారి ఎముక‌లు దృఢంగా, ఆరోగ్యంగా ఉండాలి. అందుకు గాను గ‌ర్భిణీలు కాల్షియం అధికంగా ఉండే ఆహారాల‌ను తీసుకోవాలి. మ‌రి ఆ ఆహారాలు ఏమిటంటే..

Pregnancy Foods to eat for healthy and strong baby Pregnancy Foods to eat for healthy and strong baby
Pregnancy Foods

గ‌ర్భిణీలు కాల్షియం అధికంగా ఉండే ఆహారాల‌ను తీసుకుంటే బిడ్డ‌కు ఎంతో మేలు జ‌రుగుతుంది. వారి ఎముక‌లు బ‌లంగా మారుతాయి. దీంతో వారు అన్ని విధాలుగా దృఢంగా, ఆరోగ్యంగా ఉంటారు. అందుకు గాను కాల్షియం అధికంగా ఉండే పాల‌కూర‌, పాలు, పెరుగు, మ‌జ్జిగ‌, ప‌నీర్ వంటి ఆహారాల‌ను గ‌ర్భిణీలు ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్‌లో తినాలి. అలాగే యాపిల్స్, నారింజ‌, దానిమ్మ వంటి పండ్ల‌ను కూడా తినాలి. దీంతో వీటిల్లో ఉండే కాల్షియం, విట‌మిన్ సి గ‌ర్భిణీల‌కు ఎంతో మేలు చేస్తాయి.

ఇక తృణ ధాన్యాల‌ను కూడా గ‌ర్భిణీలు తీసుకోవాలి. ఓట్స్‌, బార్లీ వంటి వాటిని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి శ‌క్తి ల‌భిస్తుంది. అల‌స‌ట రాకుండా ఉంటుంది. అలాగే రోజూ నీటిని అధికంగా సేవించాలి. దీంతో శ‌రీరంలోని వ్య‌ర్థాలు సుల‌భంగా బ‌య‌ట‌కు పోతాయి. బిడ్డ ఆరోగ్యంగా ఉంటుంది. దీంతోపాటు కోడిగుడ్ల‌ను కూడా ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇవి కాల్షియంకు ఉత్త‌మ వ‌న‌రు అని చెప్ప‌వ‌చ్చు. ఇలా ఈ ఆహారాల‌ను తీసుకుంటే కాల్షియం అధికంగా ల‌భించి బిడ్డ ఆరోగ్యంగా ఉంటుంది. ఎదుగుద‌ల లోపం రాకుండా చూసుకోవ‌చ్చు. బిడ్డ బ‌లంగా మారుతుంది.

Admin

Recent Posts