Varshini Sounderajan : బ్లాక్ డ్రెస్‌లో హీట్ పెంచుతున్న యాంక‌ర్ వ‌ర్షిణి..!

Varshini Sounderajan : ప్ర‌స్తుత త‌రుణంలో సోష‌ల్ మీడియాలో హీరోయిన్లు చేస్తున్న గ్లామ‌ర్ షో అంతా ఇంతా కాదు. అందాల ఆర‌బోత‌నే ల‌క్ష్యంగా చేసుకుని తెగ పోస్టులు పెడుతున్నారు. ఓ వైపు ఫాలోవ‌ర్ల‌ను పెంచుకుంటూనే.. మరోవైపు సినిమా అవ‌కాశాల కోసం ద‌ర్శ‌క నిర్మాతల‌ క‌ళ్ల‌లో ప‌డేందుకు య‌త్నిస్తున్నారు. అందులో భాగంగానే కొంద‌రికి సినిమా అవ‌కాశాలు కూడా వ‌స్తున్నాయి. ఇక హీరోయిన్లే అనుకుంటే యాంక‌ర్లు కూడా అలాగే వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ముఖ్యంగా బుల్లితెర‌పై ఎంతో గుర్తింపు తెచ్చుకున్న వ‌ర్షిణి సౌంద‌రాజ‌న్ చేస్తున్న గ్లామ‌ర్ షో అంతా ఇంతా కాదు.

Varshini Sounderajan latest black color dress photos viral
Varshini Sounderajan

యాంక‌ర్ వ‌ర్షిణి ఈ మ‌ధ్య సినిమాల్లోనూ బాగానే యాక్ట్ చేస్తోంది. అందులో భాగంగానే ఆమె చంద‌మామ క‌థ‌లులో నటించి అల‌రించింది. అలాగే ల‌వ‌ర్స్ అనే సినిమాలో, పెళ్లి గోల అనే వెబ్ సిరీస్‌లో న‌టించి మంచి పేరు తెచ్చుకుంది. ఇక తాజాగా ఈమె బ్లాక్ టాప్‌, జీన్స్ ధ‌రించి చేసిన ఫొటోషూట్ తాలూకు ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ఈ ఫొటోల్లో ఆమె అందాలను ఆర‌బోసింది.

వర్షిణి తాజాగా షేర్ చేసిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ఈ క్ర‌మంలోనే నెటిజన్లు ఆ ఫొటోల‌కు కామెంట్లు కూడా చేస్తున్నారు. ఇక వ‌ర్షిణి చివ‌రిసారిగా మ‌ళ్లీ మొద‌లైంది అనే మూవీలో న‌టించ‌గా.. గుణ శేఖ‌ర్ తెర‌కెక్కిస్తున్న శాకుంత‌లం అనే సినిమాలోనూ ఈమెకు ఒక పాత్ర ద‌క్కింది. దీంతో త్వ‌ర‌లో ఈ మూవీలో క‌నిపించ‌నుంది.

Editor

Recent Posts