హెల్త్ టిప్స్

పుట్ట‌బోయే బిడ్డ ఎక్కువ బ‌రువుతో పుట్టాలంటే.. మ‌హిళ‌లు వీటిని తినాలి..!

గర్భధారణ సమయంలో మహిళలు, పుట్టబోయే పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉండాలి. ఇద్దరికీ కూడా ఖచ్చితంగా సమతుల్య ఆహారం అవసరం. కనుక మహిళలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అలా కనుక చేస్తే ఆరోగ్యంగా ఉండొచ్చు. ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు వంటి ముఖ్యమైన పోషకాలు చాలా అవసరం. కాబట్టి వీటిపై కూడా తప్పక శ్రద్ద పెట్టాలి. అయితే బలంగా, లావుగా ఉన్న బిడ్డను మీరు కోరుకున్నట్లయితే తప్పక ఈ పద్ధతిని అనుసరించండి.

కొన్ని పోషకాలు మీకు, మీ బిడ్డకు శారీరక ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఎటువంటి సమస్యలు లేకుండా గర్భధారణను సంతోషకరమైన క్షణం చేస్తాయి. మీ శిశువు నాడి, మెదడు, వెన్ను అభివృద్ధికి ఫోలిక్ ఆమ్లం చాలా ముఖ్యం. 500 మైక్రోగ్రాముల వరకు పట్టవచ్చు. దీని వల్ల శిశువు బరువు పెరుగుతుంది. అలానే హిమోగ్లోబిన్ సమస్యలను నివారించడానికి, ముందస్తు ప్రసవాలను నివారించడానికి కూడా ఇది సహాయపడుతుంది. అలాగే మీ శిశువు అభివృద్ధికి ప్రోటీన్ చాలా ముఖ్యం. ప్రోటీన్స్ ని తీసుకోవడం వల్ల శిశువు రక్తం, ఎముకలు, అవయవాలు, కండరాలు, కణజాలాలను పెరగడానికి సహాయపడుతుంది. తగినన్ని మాత్రమే తీసుకోండి అతిగా కాదు.

pregnant women must take these foods for healthy baby

హిమోగ్లోబిన్ కోసం ఇనుము అవసరం. శిశువు పెరిగేకొద్దీ శిశువు, తల్లికి తగినంత ఇనుము ఉండాలి. ఇది కనుక లేకపోతే పుట్టబోయే బిడ్డకు రక్తహీనత, బరువు తగ్గడం, గర్భస్రావం అయ్యే అవకాశం ఉంది. రోజుకు 35 మిల్లీగ్రాముల ఇనుము అవసరం మహిళలకి. గూస్బెర్రీస్, నిమ్మకాయలు, టమోటాలు వంటి విటమిన్ సి మొదలైన వాటిల్లో ఐరన్ ఉంటుంది.

Admin

Recent Posts