హెల్త్ టిప్స్

నూనెల్లోకల్లా మేలైనది.. నువ్వులనూనె.. ఎందుకో తెలుసా?

నువ్వులు శరీరానికి అవసరమైన, ఆరోగ్యాన్ని పెంపొందించే అన్ని రకాల పోషకాలను కలిగి ఉంటాయి. కావున వీటిని పవర్ హౌసెస్ అంటారు. నువ్వులనూనెతో చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. దీన్ని ఆయుర్వేద వైద్యంలోనూ విరివిగా వాడుతారు. నువ్వులనూనె ఉపయోగాలేంటో తెలుసుకుందాం.

చర్మాన్ని సంరక్షిస్తుంది..

చర్మాన్ని కాపాడడంలో నువ్వులనూనె ప్రాధాన్యత చాలానే ఉంది. నువ్వులనూనెలో విటమిన్ ఇ, బి విటమిన్లు చర్మానికి సంబంధించిన అన్ని రకాల సమస్యలను దూరం చేసే గుణం అందులో పుష్కలంగా ఉంది. దీన్ని వాడడం వల్ల ముఖం ఫ్రెష్‌గా, యవ్వనంగా మెరుస్తూ ఉండేట్లు చేస్తుంది.

చిన్నారుల దేహాన్ని పుష్టిగా ఉంచడంలో..

చిన్నారుల అందం ఆరోగ్యం విషయంలో నువ్వుల నూనె కీలక పాత్ర పోషిస్తుంది. దీనిలోని విటమిన్స్, మినరల్స్ చిన్నారుల దేహాన్ని పుష్టిగా ఉంచుతుంది. దీంటో విటమిన్ ఇ పుష్కలంగా లభిస్తుంది. దీనిలోని యాంటీ యాక్సిడెంట్లు చిన్నారుల్లో కొవ్వు స్థాయిని నియంత్రణలో ఉంచుతుంది. స్నానానికి ముందు పసిపిల్లల మాడుకు, శరీరానికి నువ్వులనూనెతో మర్దన చేస్తే హాయిగా నిద్రపోతారు. ఈ నూనె చిన్నారుల మెదడు ఎదుగుదలకు బాగా తోడ్పడుతుంది. వెన్నెముక, కండరాలు బలపడేందుకు సహాయకారిగా ఉంటుంది.

sesame oil is the best oil in all

బీపీ నియంత్రణ..

దీనిలో ఒమెగా-3 ఫాటీ ఆమ్లాలు పిల్లల ఆరోగ్యానికి ఉపయోగపడడంతో పాటు బీపీ స్థాయి ఎక్కువ లేదా తక్కువ స్థాయిలో ఉన్న పెద్దవారికి బీపీని సమస్థాయికి తీసుకువస్తుంది.

కీళ్లనొప్పుల నివారణ..

నువ్వులు కాపర్ వంటి మూలకాలు, యాంటీ ఆక్సిడెంట్‌లను కలిగి ఉండడం వల్ల శక్తివంతంగా కీళ్లనొప్పులను, వాపులను తగ్గిస్తుంది. అంతేకాకుండా ఇందులో ఉండే మూలకాలు, మినరల్స్ రక్తనాళాలకు, కీళ్ళను దృఢంగా ఉండేలా చేస్తాయి. శ్వాసకోశ సంబంధిత వ్యాధుల నిరవారణకు ఉపయోగపడే మెగ్నీషియం, పేగు క్యాన్సర్, మైగ్రేన్ లాంటి సమస్యలను అరికట్టే కాల్షియం.. ఎముకలు గట్టిపడేందుకు సాయపడే జింక్ తదితరాలన్నీ ఈ నువ్వుల నూనెలో ఉండడం ప్రకృతి ఇచ్చిన వరంగా చెప్పుకోవచ్చు.

మధుమేహ వ్యాధి నివారణ..

నువ్వుల నూనెలో ఉండే మెగ్నీషియం వంటి ఇతరేతర పోషకాలు మధుమేహ వ్యాధి తగ్గించుటలో సహాయపడుతాయి. నువ్వుల విత్తనాలు నుంచి తీసిన నూనెలు శక్తివంతముగా శరీర రక్త పీడనాన్ని తగ్గించడమే కాకుండా, మధుమేహ వ్యాధి గ్రస్తులలో ప్లాస్మాలోని గ్లూకోజ్ స్థాయిలను, రక్తంలో యాంటీ ఆక్సిడెంట్ స్థాయిలను పెంచుతుంది.

జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే..

జుట్టు మృదువుగా ఉండాలన్నా.. చుండ్రు మాయం కావాలన్నా నువ్వుల నూనె బెస్ట్ అంటున్నారు సౌందర్య నిపుణులు. దీంతో జుట్టుకు కావలసిన పోషకాలు అందుతాయి.

Admin

Recent Posts