వినోదం

బాబోయ్ .. ఆలీకి అన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయా.. అవాక్క‌వుతున్న అభిమానులు..

టాలీవుడ్ ఇండస్ట్రీలో దాదాపు 40 ఏళ్లపాటు కమెడియన్ గా కొనసాగాడు ఆలీ. వేల సినిమాలలో నటించాడు. ఇక భాషతో సంబంధం లేకుండా కూడా ఇతర ఇండస్ట్రీలో కూడా మంచి గుర్తింపును అందుకున్నాడు. అయితే అలీ ఇప్పుడు రాజకీయాల్లో కూడా బిజీ అయ్యారు. ఇక గ‌తంలో త‌న కూతురు పెళ్లి చేసాడు. సినిమాలు, ప‌లు షోస్‌తో కూడా బిజీ అవుతున్నాడు. ఎంతో కాలం నుండి ఇండ‌స్ట్రీలో ఉన్న ఆలీ ఎంత సంపాదించారో అని తెలుసుకోవడానికి బాగా ఆత్రుత పడుతుంటారు.ఇప్పటికే ఎంతో మంది సినీ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రెటీలు ఎన్నో కోట్ల ఆస్తులతో మంచి హోదాలో ఉన్నారు.

నిజానికి ఇండస్ట్రీకి చెందిన నటులు చాలా వరకు ఆస్తిపరులు అవుతారు అని గ్యారెంటీ లేదు.ఎందుకంటే కొందరు నటులు ఇప్పటికి కూడా ఆర్థికంగా బాగా ఇబ్బందులు ఎదుర్కొంటునే ఉంటారు. కొందరు నటులు మాత్రం ముందు చూపుతోనే తాము సంపాదించుకున్న డబ్బులను ఏదైనా వ్యాపారం లో పెట్టడం లేదా ముందుగానే తక్కువ రేటు ఉన్న భూములను కొనుగోలు చేయడం వంటివి చేస్తూ న‌ష్ట‌పోతూ ఉంటారు. అలా ఎంతో మంది ముందు చూపుతోనే జాగ్రత్త పడి ఇప్పుడు కోటీశ్వరులుగా మారారు. ఇక మరో కమెడియన్ ఆలీ కూడా ముందు జాగ్రత్తతో బాగా భూములు కొన్నాడట.ఇక ఈయన ఆస్తుల విలువల గురించి తెలిస్తే మాత్రం పక్కా దిమ్మతిరిగిపోతుంది అనే చెప్పవచ్చు.

ali basha net worth and properties value

తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ కమెడియన్ గా నిలిచిన అలీ గురించి అందరికీ తెలిసిందే.తన నటనతో మంచి పేరు సంపాదించుకున్నాడు. సినీ ఇండస్ట్రీలో మొత్తం 1200 కు పైగా సినిమాల్లో నటించి రికార్డు క్రియేట్ చేసిన‌ కమెడియన్ ఆలీ. సంపాదనలో కొంత భాగం సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అంతేకాకుండా మహమ్మద్ భాష చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కష్టాల్లో ఉన్న వారికి సహాయం చేస్తూ వస్తూనే ఉన్నారు. ఆలీ సంపాదించిన ఆస్తుల వివరాల విషయానికి వస్తే మొత్తం 850 కోట్ల రూపాయలు ఉన్నట్లు టాక్. సంవత్సరానికి ఆయన సంపాదన 20 కోట్లకు పైగానే ఉంటుందట.

Admin

Recent Posts