Soaking Mangoes : వేసవి కాలం మధ్య దశకు చేరుకుంది. ఇంకొన్ని రోజుల పాటు ఎండలు విపరీతంగా ఉంటాయి. దీంతో వేసవి తాపం నుంచి బయట పడేందుకు చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే చల్లని పానీయాలను తాగుతున్నారు. అయితే వేసవి అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేవి మామిడి పండ్లు. ఈ సీజన్‌లో మనకు ఇవి పుష్కలంగా లభిస్తాయి. కనుక రకరకాల మామిడి పండ్లను తినేందుకు చాలా మంది ఆసక్తిని చూపిస్తుంటారు. అయితే మామిడి పండ్లను తినేముందు కచ్చితంగా నీటితో వాటిని శుభ్రం చేయాలి. ఇలా చేయడం వల్ల వాటిపై ఉండే దుమ్మ, ధూళి, కెమికల్స్ పోతాయి. అయితే మామిడి పండ్లను నీళ్లతో శుభ్రం చేయడం మాత్రమే కాదు.. వాటిని నీటిలో కాసేపు నానబెట్టాలి. ఆ తరువాతే తినాలి. అయితే దీని వెనుక ఉన్న అసలు కారణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
మామిడి పండ్లలో ఫైటిక్ యాసిడ్ అనే సహజసిద్ధమైన ఆమ్లం ఉంటుంది. ఇది పలు ఇతర పండ్లలో, కూరగాయల్లోనూ ఉంటుంది. కానీ మామిడి పండ్లలో కాస్త ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలోనే మనం మామిడి పండ్లను శుభ్రం చేశాక నీటిలో నానబెట్టకుండా నేరుగా అలాగే తింటే.. మన శరీరంలో ఈ యాసిడ్ అధిక మొత్తంలో చేరుతుంది. ఇది శరీరంలో వేడిని పెంచుతుంది. దీంతో మామిడి పండ్లను మనం అధికంగా తింటే వేడి చేస్తుంది. అది ఈ కారణం వల్లే. ఫైటిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది కనుక మామిడి పండ్లను మనం ఎక్కువగా తింటే దాని వల్ల మన శరీరంలో వేడి పెరిగి వేడి చేస్తుంది. కనుక మామిడి పండ్లను ఎక్కువగా తిన్నా కూడా వేడి చేయకుండా ఉండాలంటే.. వాటిని కాసేపు నీటిలో నానబెట్టాలి.
ఇలా మామిడి పండ్లను నీటిలో నానబెట్టడం వల్ల వాటిలో ఉండే ఫైటిక్ యాసిడ్ పరిమాణం తగ్గుతుంది. దీంతో అలాంటి మామిడి పండ్లను ఎక్కువగా తిన్నా.. పెద్దగా ప్రభావం ఉండదు. శరీరంలో వేడి పెరగదు. కాబట్టి మామిడి పండ్లను తినేముందు మొదటగా శుభ్రం కడగాలి. ఆ తరువాత వాటిని కాసేపు నీటిలో నానబెట్టాలి. దీని వల్ల దుమ్ము, ధూళి, కెమికల్స్ లేకుండా ఈ పండ్లను తినవచ్చు. అలాగే వాటిని నానబెట్టి తినడం వల్ల శరీరంలో వేడి పెరగకుండా చూసుకోవచ్చు. ఇలా మామిడి పండ్లను సురక్షితమైన పద్ధతిలో తినవచ్చు.