వెల్లుల్లి, తేనెలలో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. ఈ రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. వెల్లుల్లిని నిత్యం పలు వంటల్లో వేస్తుంటారు. దీంతో వంటలకు చక్కని రుచి వస్తుంది. ఇక తేనెను స్వీటెనర్‌గా ఉపయోగిస్తారు. ఆయుర్వేదంలో తేనెకు అధిక ప్రాధాన్యతను కల్పించారు. తేనె అనేక అనారోగ్య సమస్యలను నయం చేస్తుంది. అయితే ఈ రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల దగ్గు, జలుబు, వాపులు వంటి సమస్యలతోపాటు హైబీపీ కూడా తగ్గుతుంది.
వెల్లుల్లిని పోషకాలకు గనిగా చెప్పవచ్చు. వీటిల్లో విటమిన్ బి6, సి, ఫైబర్, మాంగనీస్, కాల్షియం వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల అధిక బరువును తగ్గించుకోవచ్చు. వెల్లుల్లిని 8 వారాల పాటు తీసుకుంటే శరీరంలోని కొవ్వు కరుగుతుందని సైంటిస్టులు చేపట్టిన పరిశోధనల్లో వెల్లడైంది. దీంతో మెటబాలిజం మెరుగు పడుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరంలోని వ్యర్థాలు, విష పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి.
తేనె శరీరానికి శక్తిని అందిస్తుంది. తేనెను తీసుకోవడం వల్ల కొవ్వును కరిగించే హార్మోన్లు విడుదలవుతాయి. తేనెలో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. అందువల్ల వాపులు తగ్గుతాయి. ఫ్రీ ర్యాడికల్స్ నాశనం అవుతాయి.
రెండు వెల్లుల్లి రెబ్బలను తీసుకుని పొట్టు తీయాలి. వాటిని బాగా నలపాలి. అనంతరం ఒక టీస్పూన్ తేనెతో ఆ వెల్లుల్లి మిశ్రమాన్ని కలిపి 15-20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తరువాత ఆ మిశ్రమాన్ని పరగడుపునే తీసుకోవాలి. అయితే ఈ మిశ్రమాన్ని ముందుగానే సిద్ధం చేసుకుని ఫ్రిజ్‌లోనూ పెట్టుకుని వాడుకోవచ్చు. కాకపోతే ఒకసారి సిద్ధం చేసిన మిశ్రమాన్ని 3 రోజుల్లోగా తీసుకోవాలి.
ఇక వెల్లుల్లి రెబ్బలను రెండు కన్నా ఎక్కువగా ఉపయోగించారు. ఎక్కువగా వెల్లుల్లిని తీసుకుంటే శ్వాస సమస్యలు వస్తాయి. నోట్లో, నాలుకపై, గొంతులో మండినట్లు అవుతుంది. గ్యాస్, గుండెల్లో మంట, అసిడిటీ, వికారం, వాంతికి వచ్చినట్లు ఉండడం, శరీరం నుంచి దుర్వాసన రావడం, డయేరియా వంటి లక్షణాలు కనిపిస్తాయి. అందువల్ల వెల్లుల్లిని ఎక్కువగా తీసుకోరాదు. ఎవరిలో అయినా ముందు తెలిపిన లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆ మిశ్రమాన్ని తినడం ఆపేయాలి. ఇక గర్భిణీలు, పాలిచ్చే తల్లులు, రక్తం పలుచగా అయ్యే మందులను తీసుకునే వారు డాక్టర్ సూచన మేరకు ఈ మిశ్రమాన్ని తీసుకోవచ్చు.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365