హెల్త్ టిప్స్

Honey And Lemon Water : తేనె, నిమ్మ‌ర‌సం ఇలా తీసుకుంటే.. త్వ‌ర‌గా బ‌రువు త‌గ్గుతారు..!

Honey And Lemon Water : చాలామంది ఆహారపు అలవాట్లుని మార్చేసుకున్నారు. జీవన విధానం కూడా మారిపోయింది. దాంతో అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఎంతోమంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. అధిక బరువు సమస్యతో బాధపడుతున్నట్లయితే ఇలా చేయండి. వెంటనే సులభంగా బరువు తగ్గిపోవడానికి అవుతుంది. తేనె తీసుకుంటే కొవ్వు కరిగిపోతుందని చాలామంది అనుకుంటూ ఉంటారు. అందుకే ఉదయం లేచిన వెంటనే కొంచెం నీళ్లల్లో తేనె, నిమ్మరసం వేసుకొని తీసుకుంటూ ఉంటారు.

కానీ నిజానికి కొవ్వుని కరిగించే గుణం తేనెలో లేదు. ఒక గ్లాసు నీళ్లల్లో తేనె, నిమ్మరసం వేసుకొని తీసుకుంటే 115 క్యాలరీని మనం తీసుకున్నట్లు అవుతుంది. చాలామంది ఏం చేస్తారంటే, ఉదయం పూట అల్పాహారం తీసుకోకుండా, కేవలం తేనె, నిమ్మరసం తీసుకుంటారు. ఆ తర్వాత వర్క్ చేసుకుంటూ ఉంటారు. అదే ఒకవేళ టిఫిన్ తిని అప్పుడు వర్క్ చేసుకున్నట్లయితే, ఒంట్లో ఉండే కొవ్వు కరగదు. మనం తీసుకునే క్యాలరీలు ఖర్చు అవుతాయి తప్ప లోపల ఏ కొవ్వు కూడా కరగదు.

take honey and lemon juice in this way for weight loss

అదే కేవలం వట్టి తేనె, నిమ్మరసం తీసుకున్నట్లయితే తక్కువ క్యాలరీలు శరీరంలోకి వెళ్తాయి. కాబట్టి మనం పని చేసుకున్నప్పుడు, ఆ కేలరీలతోపాటుగా అదనపు కొవ్వు కరుగుతుంది. ఇలా కొవ్వు కరుగుతుంది. బరువు కూడా తగ్గిపోతారు. అయితే చాలామంది ఏమనుకుంటారు అంటే.. తేనె తాగడం వలన బరువు తగ్గిపోయాను. తేనె తాగడం వలన కొవ్వు కరిగింది అని అనుకుంటారు.

తేనెకి బదులుగా ఇంకేమైనా తీసుకున్నా కూడా అదే జరుగుతుంది, తేనె నీళ్లకి బదులుగా సమానమైన క్యాలరీలను ఇచ్చే మజ్జిగ కానీ చెరుకు రసం కానీ జ్యూస్ కానీ ఇలా ఏం తీసుకున్న సరే, ఇలానే పనిచేస్తుంది తప్ప తేనె వలన మ్యాజిక్ ఏమీ జరగదు. అయితే మనం తక్కువ క్యాలరీలు తీసుకోవడం వలన ఆటోమేటిక్ గా కొవ్వు కరుగుతోంది తప్ప తేనె లేదంటే చెరుకు రసం లేదంటే బెల్లం ఇవేమీ కూడా మన శరీరానికి మేలు చేయడం లేదు.

Share
Admin

Recent Posts