Rice : దానం చేయడం వలన మనకి పుణ్యం వస్తుంది. గత జన్మల కర్మల ఫలం ఈ జన్మలో కూడా ఉంటుంది. ప్రస్తుత జన్మలో మనం చేసే దానం, వచ్చే జన్మ ఉన్నతికి ఉపయోగపడుతుంది. దానం చేస్తే, సకల పుణ్య ఫలాలు ప్రాప్తిస్తాయని పురాణం చెప్తోంది. నవగ్రహ దోష నివారణకు దానాలు చేస్తే సకల శుభాలు కలుగుతాయి. కోరికలు తీరుతాయి. అయితే ఏ గ్రహ దోషము ఉంటే ఎలా దోష నివారణ చేసుకోవచ్చు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
రవి గ్రహ దోషం ఉంటే గోధుమలను దానం చేస్తే మంచిది. కెంపు పొదిగిన ఉంగరాన్ని పెట్టుకుంటే రోగాలు, మానసిక బాధలు తొలగిపోతాయి. మనశ్శాంతిగా ఉండొచ్చు. గురు గ్రహ శాంతికి శనగలు, చంద్రుడికి బియ్యము తో పాటుగా.. కుజుడికి కందులు, బుధుడి కి పెసలు, శుక్రుడికి అలసందులు, రాహుకి మినుములు, కేతువుకి ఉలవలు.. అలానే శనికి నువ్వులు దానం చేయడం మంచిది.
మరణ భయంతో బాధపడే వాళ్ళు బియ్యం ఇవ్వడం, వ్యాధులతో నరకయాతన అనుభవించే రోగులకి వైద్యము ఇవ్వడం ఎంతో మంచిది. అలానే ఆకలితో ఉంటే అన్నదానం చేయడం మంచిది. పేదలకు ఉచితంగా విద్యను ఇవ్వడం కూడా ఎంతో మంచిది. ఈ చతుర్విధ దానాలు చేస్తే పూర్వ జన్మ పాపాలు కూడా పోతాయి. మన శక్తి కొలది దానం చేయడం అనేది ధర్మం అంటారు.
ధర్మం చేయడం వలన పుణ్యఫలం కలుగుతుంది. తోచినది ఏదైనా సరే అవసరమైన వాళ్ళకి దానం చేయడం మంచిది. శాస్త్ర నియమానుసారం దాన యోగ్యమైన వాటిని మాత్రమే దానంగా ఇవ్వాలి. వీటిని దశ దానాలు అంటారు. గోదానం, భూదానం, తిలదానం, సువర్ణ దానం, నెయ్యి దానం, వస్త్రదానం, దాన్యదానం, గుడ దానం, రజత దానం, లవణదానం. ఇవే దశ దానాలు. ముఖ్యంగా ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయడం వలన పూర్వజన్మ పాపాలు పోతాయి. ఈ జన్మలోనే సుఖిస్తారు.