హెల్త్ టిప్స్

Honey : రోజూ రాత్రి నిద్ర‌కు ముందు తేనెను ఇలా తీసుకోండి.. ఊహించ‌ని ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి..

Honey : భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచి తేనెను ఉప‌యోగిస్తున్నారు. దీన్ని వంటల్లో వేయ‌డం మాత్ర‌మే కాదు.. నేరుగా కూడా తింటారు. అలాగే ఆయుర్వేదంలోనూ తేనెకు ఎంతో ప్రాధాన్య‌త ఉంటుంది. దీన్ని అనేక ఔష‌ధాల త‌యారీలో ఉప‌యోగిస్తారు. అలాగే అనేక వ్యాధుల‌కు ఇది ఔష‌ధంగా ప‌నిచేస్తుంది. అయితే తేనెను ప్ర‌తి రోజూ తీసుకోవాలి. దీంతో అనేక విధాలుగా లాభాల‌ను పొంద‌వ‌చ్చు. తేనెను తీసుకోవ‌డం వ‌ల్ల కేవ‌లం పోష‌కాలు ల‌భించ‌డ‌మే కాదు.. శ‌క్తి కూడా వ‌స్తుంది. అలాగే వ్యాధులు కూడా న‌య‌మ‌వుతాయి. రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో ఒక టీస్పూన్ తేనెను క‌లిపి తాగాలి. లేదా రాత్రి నిద్ర‌కు ముందు తాగాలి. దీంతో అనేక విధాలుగా ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

రోజూ తేనెను ఇలా తీసుకోవ‌డం వ‌ల్ల శరీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. తేనెలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అలాగే యాంటీ వైర‌ల్‌, యాంటీ ఫంగ‌ల్‌, యాంటీ బాక్టీరియ‌ల్ గుణాలు కూడా తేనెలో ఉంటాయి. దీని వ‌ల్ల రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. వ్యాధులు, ఇన్ఫెక్ష‌న్లు త‌గ్గుతాయి. ముఖ్యంగా సీజ‌న‌ల్ వ్యాధుల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. ద‌గ్గు, జ‌లుబు, జ్వ‌రం ఉండ‌వు. తేనెను తీసుకోవ‌డం వ‌ల్ల గొంతు నొప్పి కూడా త‌గ్గుతుంది. తేనెను తీసుకుంటే శ‌రీరంలో ఉండే కొవ్వు మొత్తం క‌రుగుతుంది. ఇది అధిక బ‌రువు ఉన్న‌వారికి మేలు చేస్తుంది. తేనె వ‌ల్ల శ‌రీరంలోని క‌ణాలు ఉత్తేజం అవుతాయి. దీంతో చురుగ్గా మారుతారు. యాక్టివ్‌గా ప‌నిచేస్తారు. నీర‌సం, అల‌స‌ట ఉండ‌వు. త‌క్కువ ప‌ని చేసినా అల‌సిపోతున్నాం అనుకునేవారు ఇలా తేనెను రోజూ తీసుకుంటే ఎంతో ఫ‌లితం ఉంటుంది.

take honey daily at night for these benefits

తేనెను తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్త‌నాళాలు శుభ్ర‌మ‌వుతాయి. దీంతో ర‌క్త‌స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డుతుంది. ఫ‌లితంగా హార్ట్ ఎటాక్‌లు రావు. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. కొలెస్ట్రాల్ అధికంగా ఉన్న‌వారు ఇలా తీసుకుంటే కొలెస్ట్రాల్ స్థాయిలు త‌గ్గుతాయి. తేనె వ‌ల్ల జీర్ణ‌వ్య‌వ‌స్థ ప‌నితీరు మెరుగు ప‌డుతుంది. ఆక‌లి స‌రిగ్గా అవుతుంది. జీర్ణ‌శ‌క్తి పెరుగుతుంది. గ్యాస్‌, మ‌ల‌బ‌ద్ద‌కం, అసిడిటీ ఉండ‌వు. ఇలా తేనెతో ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. క‌నుక దీన్ని రోజూ తీసుకోవాలి. కాలాల‌తో సంబంధం లేకుండా ఏ సీజ‌న్‌లో అయినా స‌రే తేనెను తీసుకోవ‌చ్చు. ఇది అద్భుత‌మైన ఔష‌ధంలా ప‌నిచేస్తుంది. క‌నుక తేనెను రోజూ తీసుకోవ‌డం మరిచిపోకండి.

Admin

Recent Posts