Ghee : రోజూ ప‌ర‌గ‌డుపునే ఒక టీస్పూన్ నెయ్యి తింటే.. ఎన్నిలాభాలో..!

Ghee : భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచి నెయ్యిని ఉప‌యోగిస్తున్నారు. దీన్ని చాలా మంది రోజూ వంటల్లో వేస్తుంటారు. దీంతో వంట‌ల‌కు చ‌క్క‌ని రుచి, వాస‌న వ‌స్తాయి. అలాగే నెయ్యిని తీపి వంటకాల్లోనూ వాడుతుంటారు. అయితే నెయ్యిని తింటే అధికంగా బ‌రువు పెరుగుతామ‌ని.. కొలెస్ట్రాల్ చేరుతుంద‌ని.. చాలా మంది భ‌య‌ప‌డి నెయ్యిని తిన‌కుండా సందేహిస్తుంటారు. కానీ ఆయుర్వేద ప్ర‌కారం వాస్త‌వానికి నెయ్యి మ‌న‌కు ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంది. అనేక లాభాల‌ను అందిస్తుంది. ఇక నెయ్యిని రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే ఒక టీస్పూన్ మోతాదులో తీసుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

take one teaspoon full of Ghee everyday on empty stomach
Ghee

1. నెయ్యిని తిన‌డం వల్ల మ‌న‌కు విట‌మిన్ డి ల‌భిస్తుంది. ఇది రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది. వ్యాధులు, ఇన్‌ఫెక్ష‌న్లు రాకుండా చూస్తుంది. డ‌యాబెటిస్‌ను అదుపు చేస్తుంది. బ‌రువు త‌గ్గ‌డంలో స‌హాయ ప‌డుతుంది. క‌నుక నెయ్యిని రోజూ తీసుకోవాలి.

2. నెయ్యిని తీసుకోవ‌డం వ‌ల్ల జీర్ణ‌వ్య‌వ‌స్థ శుభ్రంగా మారుతుంది. దీంతో తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణ‌మ‌వుతుంది. అజీర్ణం స‌మ‌స్య ఉండ‌దు. మ‌ల‌బ‌ద్ద‌కం, గ్యాస్ త‌గ్గుతాయి.

3. చ‌ర్మ స‌మ‌స్య‌లు ఉన్న‌వారు నెయ్యిని తిన‌డం వ‌ల్ల ఎంతో మేలు జ‌రుగుతుంది. దీంతో చ‌ర్మం మృదువుగా, కాంతివంతంగా మారుతుంది. చ‌ర్మ స‌మస్య‌లు త‌గ్గుతాయి.

4. ఆక‌లిని అణ‌చుకోలేని వారు, అతిగా తినేవారు నెయ్యిని తింటే ఎంతో మేలు చేస్తుంది. దీంతో ఆక‌లి నియంత్ర‌ణ‌లో ఉంటుంది. అతిగా తిన‌కుండా జాగ్ర‌త్త‌గా ఉండ‌వ‌చ్చు. ఇది అధిక బ‌రువును త‌గ్గించేందుకు స‌హాయ ప‌డుతుంది. పొట్ట ద‌గ్గ‌రి కొవ్వు క‌రుగుతుంది.

5. నెయ్యిని తిన‌డం వ‌ల్ల శ‌రీర శ‌క్తి సామ‌ర్థ్యాలు పెరుగుతాయి. రోజూ నీర‌సంగా, నిస్స‌త్తువ‌గా ఉండేవారు, శారీర‌క శ్ర‌మ‌, వ్యాయామం ఎక్కువ‌గా చేసేవారు.. నెయ్యిని తింటే చురుగ్గా మారుతారు. ఉత్సాహంగా ప‌నిచేస్తారు. ఎంత ప‌నిచేసినా అల‌సిపోరు.

Share
Admin

Recent Posts