Sachin Tendulkar : మాజీ దిగ్గజ బ్యాట్స్‌మన్ సచిన్ టెండుల్కర్‌కు ఘోర అవమానం జరిగింది. ఆయన ఫొటోను ఉపయోగించుకుని కొందరు అక్రమంగా యాడ్స్‌ను ప్రచారం చేశారు. దీంతో ఆయనకు ఘోర అవమానం జరిగింది. ఈ క్రమంలోనే ఆయన తన ఫొటోను వాడుకున్న వారిపై లీగల్ చర్యలకు సిద్ధమవుతున్నారు. అసలు ఈ విషయంలో ఏం జరిగిందో.. ఇప్పుడు తెలుసుకుందాం.
గోవాలో బిగ్ డాడీ అనే కసినో ఉంది. అయితే వారు ఈ మధ్య సచిన్ టెండుల్కర్ ఫొటోను ఉపయోగించి పలు బ్రాండ్స్‌కు ప్రచారం చేశారు. ఈ క్రమంలోనే ఆ యాడ్స్ సచిన్ కంటపడ్డాయి. అయితే తాను ఎలాంటి యాడ్స్‌లో నటించలేదని.. సదరు కసినో వారు తనకు సంబంధం లేకుండానే తన ఫొటోలను మార్ఫింగ్ చేసి తమకు చెందిన పలు బ్రాండ్స్ ను ప్రమోట్ చేసుకున్నారని.. ఈ విషయంలో అసలు తనను వారు సంప్రదించలేదని.. సచిన్ తెలిపారు. ఈ క్రమంలోనే దీన్ని తనకు జరిగిన ఘోర అవమానంగా భావిస్తున్నానని అన్నారు.
తాను గతంలో ఎప్పుడూ జూదం, మద్యం, పొగాకు ఉత్పత్తులను ప్రోత్సహించే యాడ్స్‌లో నటించలేదని.. అసలు అలాంటి యాడ్స్ లో ఎప్పటికీ నటించేది లేదని.. అయినప్పటికీ ఆ కసినో వారు తన ఫొటోలను మార్ఫింగ్ చేసి సదరు యాడ్స్‌ను తన పేరిట సృష్టించి ప్రచారం చేశారని.. వాటికి, తనకు ఎలాంటి సంబంధం లేదని.. సచిన్ తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఇక ఈ విషయంలో తన లీగల్ టీమ్ పనిచేస్తుందని.. ఆ కసినోపై లీగల్ చర్యలకు సిద్ధమవుతున్నానని.. ఆయన తెలిపారు.
కాగా సచిన్ టెండుల్కర్ గతంలో ఎన్నడూ చెడు అలవాట్లను ప్రోత్సహించే యాడ్స్ లో నటించలేదు. అందుకనే ఆయన ఈ విషయంలో తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తాను అలాంటి యాడ్స్‌ను, బ్రాండ్స్ ను అసలు ప్రోత్సహించబోనని స్పష్టం చేశారు. సచిన్ ఇప్పటికే వన్డేలు, టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా రికార్డులు సృష్టించగా.. ఆయన రికార్డులను ఇప్పటికీ ఎవరూ అధిగమించలేకపోయారు. ఇక సచిన్ 2013లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి.. అన్ని ఫార్మాట్‌ల క్రికెట్ నుంచి తప్పుకున్నారు.