Sugar BP : షుగర్, హైబీపీ.. ఇవి రెండు ఒకదానికొకటి స్నేహితులని చమత్కరిస్తుంటారు. ఇవి రెండూ చాలా మందికి ఉంటాయి. కొందరికి కేవలం బీపీ మాత్రమే ఉంటుంది. కొందరికి షుగర్ ఉంటుంది. కొందరికి ఇవి రెండూ ఉంటాయి. అయితే ఈ రెండింటిలో ఏ ఒక్కటి ఉన్నా అన్ని జాగ్రత్తలు పాటిస్తుంటే.. పెద్దగా సమస్య ఉండదు. కానీ రెండూ ఉంటే మాత్రం చాలా ఇబ్బందులు వస్తాయి. ఒకే వ్యక్తికి బీపీ, షుగర్ రెండూ ఉంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు ఏ సమయంలో ఏం జరుగుతుందో ఏమీ తెలియదు. కనుక రెండింటినీ నియంత్రణలో ఉంచుకోవాలి. ఇక కింద తెలిపిన వాటిని తీసుకోవడం వల్ల షుగర్, బీపీ రెండింటినీ ఒకేసారి కంట్రోల్ చేయవచ్చు. మరి ఆ ఆహారాలు ఏమిటంటే..
1. నేరేడు పండ్లు మనకు వేసవి ముగిసే సమయంలో వస్తాయి. అయితే వీటిని జ్యూస్ రూపంలో తయారు చేసి విక్రయిస్తుంటారు. అందువల్ల దాన్ని రోజూ పరగడుపునే తాగవచ్చు. పరగడుపునే నేరేడు పండ్ల జ్యూస్‌ను 30 ఎంఎల్ మోతాదులో తాగుతుండాలి. దీంతో షుగర్, బీపీ రెండూ తగ్గుతాయి.
2. షుగర్, బీపీ రెండింటినీ ఒకేసారి తగ్గించే ఆహారాల్లో.. బీట్‌రూట్ ఒకటి. దీన్ని రోజుకు ఒక కప్పు మోతాదులో తీసుకోవాలి. లేదా ఒక కప్పు జ్యూస్ కూడా తాగవచ్చు. దీన్ని కూడా పరగడుపునే తీసుకుంటే షుగర్, బీపీ రెండూ ఒకేసారి తగ్గుతాయి.
3. రోజూ ఉదయాన్నే పరగడుపునే 2 పచ్చి వెల్లుల్లి రెబ్బలను అలాగే నమిలి తింటే శరీరంలో రక్తసరఫరా మెరుగు పడుతుంది. హైబీపీ తగ్గుతుంది. కొలెస్ట్రాల్, షుగర్ లెవల్స్ కూడా తగ్గుతాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్‌లు రాకుండా చూసుకోవచ్చు.
4. గుమ్మడికాయ విత్తనాలను రోజూ సాయంత్రం స్నాక్స్ సమయంలో గుప్పెడు మోతాదులో తింటుండాలి. ఇందులో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది బీపీని తగ్గిస్తుంది. అలాగే ఈ విత్తనాల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు డయాబెటిస్‌ను అదుపు చేస్తాయి. కనుక వీటిని రోజూ తింటే షుగర్, బీపీ రెండింటినీ ఒకేసారి అదుపు చేయవచ్చు. దీంతో ఇతర సమస్యలు రాకుండా ఉంటాయి.