lifestyle

బ్రహ్మకుమారీల గురించి మీ అభిప్రాయం ఏమిటి? అసలు వారి సంఘం చేసే పనులు ఏమిటి?

బ్రహ్మకుమారీస్ గురించి నాకు పెద్ద గొప్ప అభిప్రాయం లేదు అండి .. మొదటగా సంస్థ గురించి కాదు , నా అభిప్రాయం,నా అనుభవం చెప్తాను ఎవరన్నా నొచ్చుకునే వాళ్ళు, ఫాలోయర్స్ ఉంటె చదవకండి !! మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమం లో చేరినప్పుడు కొన్ని రోజులు అక్కడ బ్రహ్మకుమారీస్ క్లాస్సేస్ కు వెళ్లాను .. అసలు వారు ఎం చెప్తారు, ఎందుకు బ్రహ్మకుమారీస్ లో చేరాలి అని .. రోజు పొద్దునే కొన్ని వోకల్ సెషన్స్ ఉండేవి .. బ్రహ్మకుమారీస్ కి జీవితాన్ని అంకితం చూసినవారంతా వైట్ అండ్ వైట్ డ్రెస్సులు వేసుకుంటారు .. బ్రహ్మచారులు గానే జీవితాంతం ఉండిపోతారు .. వారు తమ తోటి వారిని అన్నదమ్ముల్లా అక్కాచెల్లెళలా చూసుకుంటారు .. పొరపాటున పెళ్లి అయినా తారువాత వాళ్ళ జీవితాన్ని బ్రహ్మకుమారీస్ కి అంకితం చేశారు అనుకోండి .. భార్య భర్తలను కూడా సోదరుల్లాగా చూడాలని వారి నియమం అని అక్కడ వారు చెప్పంగా విన్నాను ..

పొద్దునే వెర్బల్ క్లాస్సేస్ ఉండేవి .. అందరిని గార్డెన్లో రమ్మని చెప్పారు .. ఒక తెల్ల డ్రెస్ వేసుకున్న దీదీ వచ్చి .. కాసేపు ఆత్మ, పరమాత్మ అని క్లాస్ తీసుకున్నారు .. మీకు పరమాత్మ దెగ్గర సుఖం ఉంది అని మీరు అనుకుంటున్నారు .. లేదా ఇలా ఆత్మ గానే మిగిలిపోవడం ఇష్టమా అని ఆవిడ అడిగారు .. ఒక చార్ట్ ఓపెన్ చేశారు .. అందులో రాజా యోగ మెడిటేషన్ గురించి చెప్పారు .. అదేంటో వెరైటీ గా కింద మనిషి ఉన్నాడు .. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల పైన .. పరమేశ్వరుడు అనే ఆయన ఇంకొకడు ఉన్నాడని ఆ వాళ్ళ నమ్మకం అని .. ఆ చార్ట్ చూసాక నాకు అర్ధం అయింది .. ఆ తరువాత క్లాస్ అయిపొయింది .. వాళ్ళ డ్రెస్ కోడ్ తో పాటు గ్రీటింగ్ కోడ్ ఒకటి మాకు నేర్పించారు .. ఆ రోజుల్లో WWF లో నేషన్ అఫ్ డామినేషన్ అని బ్యాచ్ ఉండేవారు .. వారి సైన్ ఏంటి అంటే .. ఒక చెయ్యి పైకెత్తడము .. ఇక్కడ కూడా ఒక సైన్ నేర్పించారు .. ఓం శాంతి..

who are brahmakumaris what they will do

.. ఎవరన్నా వైట్ అండ్ వైట్ డ్రెస్ వారు కనిపిస్తే ఓం శాంతి అనాలి .. కచ్చితంగా అని ఏమి లేదు.. కాకపోతే ఎం చేసిన కూడా ఇన్వొల్వె అయ్యి చేయాలి అని .. కనిపించిన ప్రతి వారిని ఓం శాంతి అని పలకరించేవాడిని .. మధ్యాహ్నం మళ్ళి క్లాస్ కి రమన్నారు .. అది ప్రాక్టికల్ క్లాస్, మెడిటేషన్ చేయిస్తారు అని .. సరే థియరిటికల్ అంత ప్రభావం చూపలేదు ప్రాక్టికల్ ట్రై చేద్దాం అని అనుకున్న .. ఒక మ్యూజిక్ పెట్టారు .. ఒక వైట్ అండ్ వైట్ 60 ఏళ్ళ పెద్దాయిన వచ్చి కళ్ళు మూసుకోండి .. బాగా డీప్ గా కాన్సన్ట్రేట్ చేయండి .. బాగా డీప్ గా వెళ్ళండి .. డీప్ గా .. మీకు కాంతి ఏదన్నా కనిపిస్తుందా ?? కొంత మంది ఎస్ అన్నారు .. నాకు మాత్రం క‌నిపించ‌లేదు. త‌రువాత వెళ్ళి ఆ పెద్దయినతో మాట్లాడాను .. సర్ నాకు కాంతి కనిపించలేదు అని ..

ఆయన అప్పుడే ఎలా కనిపిస్తుంది బాబు .. కొంత మందికి టైం పడుతుంది అని అన్నారు .. నేను క‌న్విన్సు అయిపోయి .. వెళ్ళిపోయాను .. మళ్ళి పొద్దున సేమ్ టు సేమ్ .. ఆత్మ, పరమాత్మా క్లాస్ .. మధ్యాహ్నం మెడిటేషన్ .. ఒక 20 రోజులు వెళ్లాను .. అస్సలు ఎక్కడం లేదు .. ప్రాబ్లెమ్ నాలో ఉందా .. బ్రహ్మకుమారీస్ లో ఉందా అర్ధం కాలేదు .. సరే అక్కడ కొందరితో పరిచయాలు ఏర్పడుతాయి ఆ 30 డే స్టే లో .. అట్లా నాకు ఒక స్నేహితురాలు పరిచయం అయింది .. .. ఏదో అవసరం అయ్యి నేను నా స్నేహితురాలు, ఎంట్రన్స్ లో ఉన్న ఆఫీస్ కి వెళ్లాల్సి వచ్చింది .. మా ఇద్దర్ని వెళ్ళకూడదు , ఒక్కరి వెళ్ళాలి అంటే .. నేను వెళ్తాను అని చెప్పి తనని అక్కడే ఉండమని చెప్పాను .. పని చూసుకొని వచ్చి .. నెను వెనక్కు వచ్చేసరికి .. నా స్నేహితురాలు అక్కడే నిల్చుకొని మొబైల్ చుస్కుంటున్నది .. 3:30 క్లాస్ చెప్పే పెద్దయిన తన వెనకాల నిల్చొని ఉన్నాడు .. నేను వస్తున్నాను అని గమనించలేదు .. తనను వెనుక నుంచి పై నుంచి కింద దాకా అదే పనిగా కామంతో చూస్తున్నాడు ..

నేను వెనక్కు వచ్చి సీరియస్ గా చూసాను .. పైకి తలెత్తి నన్ను చూసాడు, సిగ్గుపడి .. అక్కడ నుంచి వెంటనే జారుకున్నాడు .. ఆ తరువాత నుంచి ఆ క్లాస్ కి నేను వెళ్ళలేదు .. వెళ్ళ బుద్ది కాలేదు .. అందరూ మానవ మాత్రులే .. కామం అనేది అందర్నీ బాధిస్తుంది .. తప్పు లేదు .. కానీ అట్లా జీవితాన్ని అంకితం చేసాక .. మనిషి అట్లా ఉండకూడదు అనిపించింది .. ఒక మనిషివలనో, ట్రైనర్ల వల్లనో సంస్థను మొత్తం నిందించకూడదు .. కానీ పై నుంచి క్షేత్ర స్థాయి వరకు అందరు సరిగ్గా ఉంటేనే ఒక సంస్థకు పవిత్రత పెరుగుతుంది .. కొన్ని అనుభవాల వలన మన ఆలోచనలే ఆ సంస్థ గురించి మారిపోతాయి. అందుకే నాకు ఇచ్చిన సెషన్స్ లో కొన్ని లోటు పాట్లు నాకు కనిపించాయి .. బహుశ నాకు మంచి గైడ్స్ దొరకలేదు ఏమో .. అందుకే ఆ సంస్థ చేసే చర్యల్ని, చూపే మార్గాన్ని నేను అందుకోలేకపోయాను ఏమో .. నాకు తెలీదు .. కానీ నాకు సంతృప్తి లేదు .. దాన్ని వదిలేసాను, మళ్ళీ దాని జోలికి వెళ్ళలేదు .

సేవ కార్యక్రమాలు వచ్చేసరికి కొన్ని కనిపిస్తున్నాయి .. వారు ఒక రెనెవెబుల్ ఎనర్జీ సోర్సెస్ ప్రాజెక్ట్ ఒకటి చేపట్టారు అని .. మౌంట్ అబూ లో సోలార్ థర్మల్ పవర్ ప్లాంట్ ప్రాజెక్ట్ ఒకటి చేపట్టారు .. దానికి గవర్నమెంట్ వారు కూడా సహాయ పడ్డారు .. దాని వలన విద్యుథ్ ఉత్పత్తి అవుతుంది అంట .. ఇంకొకటి వీరు యోగికి వ్యవసాయం అని ఒక ఒకటి చేపట్టారు .. గవర్నమెంట్ వారి సహకారంతో .. దాని వలన రూరల్ ప్రాంతాల్లో ఉన్న రైతులుకు సహాయం చేశారు… హెల్త్ కేర్ వచ్చేసరికి వీరు రాజస్థాన్ లో వాటుముల్ గ్లోబల్ హాస్పిటల్ తెరిచి అక్కడ లోకల్ ప్రజలకు సేవలు చేస్తున్నారని వినికిడి.

Admin

Recent Posts