హెల్త్ టిప్స్

Liver : వీటిని రోజూ తినండి.. లివర్ మ‌ళ్లీ కొత్త‌గా మారుతుంది..!

Liver : చాలామంది రకరకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అనారోగ్య సమస్యలు కలగకూడదంటే మంచి ఆహార పదార్థాలను తీసుకోవడం, సరైన జీవన విధానాన్ని పాటించడం మంచిది. ఏదైనా సమస్య ఉంటే వైద్యుని సలహా తీసుకోవడం కూడా మంచిది. అయితే, ఎప్పుడైనా లివర్ సమస్యలు ఉంటే, ఈ ఆహార పదార్థాలని తీసుకుంటే ఎంతో మంచి జరుగుతుంది. లివర్ సమస్యలతో బాధపడే వాళ్ళు, వీటిని తీసుకుంటే ఎంతో మంచిది. లివర్ సమస్యలు ఉంటే, ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. బచ్చలి కూర, మెంతికూర వంటి ఆకు కూరలని తీసుకోండి. ముఖ్యంగా ఇవి లివర్ ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి.

ద్రాక్ష పండ్లను కూడా లివర్ సమస్యలతో బాధపడే వాళ్ళు, తీసుకోవాలి. విటమిన్ సి, ఫైబర్, క్యాల్షియం, విటమిన్ ఏ తో పాటుగా ఐరన్ పుష్కలంగా ద్రాక్షలో ఉంటుంది. ద్రాక్ష పండ్లలో రెండు ప్రధాన యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ద్రాక్ష పండ్లను తీసుకుంటే కూడా లివర్ ఆరోగ్యం బాగుంటుంది. అలానే, లివర్ సమస్యలతో బాధపడే వాళ్ళు కాఫీ ని లిమిట్ గా తీసుకుంటే మంచిది. కాఫీ ని తీసుకోవడం వలన లివర్ ఆరోగ్యంగా ఉంటుంది. కాఫీలో ఉండే పాలిఫినాల్స్, యాంటీ ఇన్ఫ్లమెంటరీ గుణాలు లివర్ ఆరోగ్యనికి సహాయపడతాయి.

take these foods daily your liver will work like new

అలానే, కాఫీ ని తీసుకోవడం వలన కాలేయంలో మంట తగ్గుతుంది. లివర్ ఆరోగ్యానికి రోజు ఒక కప్పు కాఫీ తీసుకోవడం మంచిది. క్యాబేజీ, బ్రోకలీ, కాలీఫ్లవర్ కూడా లివర్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కనుక, లివర్ సమస్యలతో బాధపడే వాళ్ళు క్యాబేజీ, బ్రోకలీ, కాలీఫ్లవర్ ని తీసుకోవడం మంచిది. బీట్ రూట్ ని తీసుకుంటే కూడా మంచిదే. బీట్ రూట్ లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అలానే, ఇతర పోషకాలు కూడా ఉంటాయి. ఇవి లివర్ ఆరోగ్యానికి ఎంతగానో సహాయం చేస్తాయి.

నట్స్ వంటి వాటిని కూడా మీరు తీసుకోండి. నట్స్ ని తీసుకుంటే కూడా లివర్ ఆరోగ్యం బాగుంటుంది. ఓట్స్, బార్లీ, మిల్లెట్స్‌ మొదలైన తృణధాన్యాలను తీసుకుంటే కూడా కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది. వెల్లుల్లిలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. వెల్లుల్లిని తీసుకుంటే కూడా చాలా సమస్యలు పోతాయి. లివర్ ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఆరోగ్యానికి పసుపు ఎంతో మేలు చేస్తుంది. పసుపుతో కూడా లివర్ ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు. రోజు మంచినీళ్ళని కూడా తగినంత తీసుకుంటూ ఉండండి. ఇలా వీటితో లివర్ ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు. లివర్ సమస్యలకి దూరంగా ఉండొచ్చు.

Admin

Recent Posts