Knee Pains : పెద్ద వారి నుండి చిన్న వారి వరకు అందరినీ వేధిస్తున్న అనారోగ్య సమస్యలలో మోకాళ్ల నొప్పుల సమస్య కూడా ఒకటి. ప్రస్తుత కాలంలో ఈ సమస్యతో బాధపడే వారు రోజురోజుకీ ఎక్కువవుతున్నారు. పూర్వ కాలంలో పెద్దలు ఎక్కువగా మోకాళ్ల నొప్పులు అనడాన్ని మనం వింటుండే వాళ్లం. కానీ ప్రస్తుత కాలంలో వచ్చిన ఆహారపు అలవాట్ల కారణంగా చిన్న వయస్సులోనే మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. ఈ మోకాళ్ల నొప్పులతో బాధపడే వారు ఎక్కువ దూరం నడవలేరు. వారి పనులను వారు చేసుకోలేరు. మెట్లు ఎక్కలేరు. ఒక చిన్న చిట్కాను ఉపయోగించి మనం మోకాళ్ల నొప్పి సమస్య నుండి బయటపడవచ్చు.
మోకాళ్ల నొప్పిని తగ్గించడంలో ఈ చిట్కా ఎంతగానో ఉపయోగపడతుంది. ఈ చిట్కాను ఉపయోగించి 2 నుండి 3 రోజులల్లోనే మనం మోకాళ్ల నొప్పుల సమస్య నుండి బయటపడవచ్చు. దీనిని దీర్ఘ కాలికంగా ఉపయోగించడం వల్ల భవిష్యత్తులో కూడా మోకాళ్ల నొప్పులు రాకుండా ఉంటాయి. మోకాళ్ల నొప్పిని తగ్గించే ఈ చిట్కా ఏమిటి.. ఇంట్లో ఉండే వాటితో దీనిని ఎలా వాడాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఒక గిన్నెలో పసుపును తీసుకుని అందులో ఒక టీ స్పూన్ పంచదారను పొడిగా చేసి వేసుకోవాలి. ఇందులోనే ఆకు, వక్కలను తినడానికి ఉపయోగించే సున్నాన్ని వేసి బాగా కలుపుకోవాలి. ఇందులో తగినన్ని నీళ్లు పోసుకుంటూ పేస్ట్ లా చేసుకోవాలి. పసుపు, సున్నాన్ని కలపడం వల్ల ఈ మిశ్రమం ఎరుపు రంగులోకి మారుతుంది. రాత్రి పడుకునే ముందు ఈ మిశ్రమాన్ని మోకాళ్లపై రాసుకుని వేడిగా ఉండేలా మోకాళ్ల చుట్టూ వస్త్రాన్ని కట్టుకోవాలి. ఉదయం లేవగానే పట్టీని తీసి గోరు వెచ్చని నీళ్లతో మోకాళ్లను శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తూ ఉండడం వల్ల మోకాళ్ల నొప్పులు తగ్గుతాయి. ఈ చిన్న చిట్కాను ఉపయోగించడం వల్ల ఎటువంటి మందులను వాడే అవసరం లేకుండానే మోకాళ్ల నొప్పులను తగ్గించుకోవచ్చు.