శరీరం ఆరోగ్యంగా వుండాలంటే కొలెస్టరాల్ అవసరమే. అయితే కొలెస్టరాల్ లో మంచి కొలెస్టరాల్, చెడు కొల్లెస్టరాల్ అని రెండుగా ఉంటాయి. మేలు చేసే కొలెస్టరాల్ ని పొందాలంటే మన ఆహార విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆకు కూరలు – వారంలో కనీసం మూడు రోజులు ఆకు కూరలను తప్పక తినాలి. కాయగూరలు – ఆహారంలో తాజా కాయకూరలకు ప్రాధాన్యత పెంచాలి.
ముతక బియ్యం – బ్రౌన్ రైస్ లేదా పాలిష్ పట్టిన బియ్యాన్ని వాడాలి. పప్పుల మార్పు – కందిపప్పు, పెసర పప్పులను మార్చి మార్చి వాడండి. తాజా పండ్లు – పండ్లు తినాలి. జామ, అరటి, దానిమ్మ, బొప్పాయి, పుచ్చకాయ, బత్తాయి, కమల, ద్రాక్ష వంటి పండ్లు ఆయో సీజన్లలో దొరికేవి తినాలి. పౌల్ట్రీ ఉత్పత్తులు – గుడ్లు అధికంగా తినండి. బ్రాయిలర్ కోళ్ళమాంసం తగ్గించండి.
సీ ఫుడ్స్ – తక్కువ నూనె వేసి వేయించిన చేపలను తినండి. వారంలో మూడు రోజులు చేపలు తీసుకోండి. నూనెల వాడకం – వంట నూనెల విషయంలో వనస్పతి మినహా మిగిలినవి ఏవైనా ఒక తరహా నూనెకే పరిమితం అవవ్వండి. వంట నూనెలను అతి తక్కువ వాడండి. ఈ ఎనిమిది జాగ్రత్తలు పాటిస్తే మీ శరీరంలో చెడు కొల్లెస్టరాల్ చేరకుండా వుంటుంది. మంచి కొలెస్టరాల్ ఎప్పటికపుడు పెరిగి ఆరోగ్యంగా వుంచుతుంది.