హెల్త్ టిప్స్

సాయంత్రానికి నీర‌సించి బాగా అల‌సిపోతున్నారా.. అయితే వీటిని తీసుకోండి..!

సాయంత్రమయ్యే సరికి పూర్తిగా అలసిపోయారు. కానీ పుట్టిన రోజు పార్టీకి ఏర్పాట్లు చేయాలి. లేదా బోర్డు మీటింగ్ కు హాజరవాలి అటువంటపుడు తక్షణ శక్తికిగాను కొన్ని ఆహారాలు తీసుకోవాలి. వాటిలో ప్రధానమైనవేంటో పరిశీలిద్దాం. లెమనేడ్ – ఇందులో వుండే షుగర్ నుండి గ్లూకోజ్ శరీరానికి వెంటనే అందుతుంది. శరీరంలో సాయంత్రానికి ఆవిరి అయిపోయిన ద్రవాలను, ఖనిజలవణాలను భర్తీ చేసేందుకు ఇందులో వుండే ఉప్పు కూడా తోడ్పడుతుంది. అన్నిటికంటే ప్రధానమైన విటమిన్ సి నిమ్మకాయ నుండి లభిస్తుంది.

అరటిపండు – అలసిన శరీరానికి గ్లూకోజ్ ను కార్బోహైడ్రేట్లను ఎంతో తేలికగాను వేగవంతంగాను ఈ పండు అందిస్తుంది. రక్తంలోని హిమోగ్లోబిన్ కవసరమైన ఐరన్ అందిస్తుంది. ఎంతో శక్తి కలిగి భావిస్తారు. ఛీజ్ – సాధారణంగా బరువు తగ్గాలంటూ డైటింగ్ లోవుండి నీరసపడేవారు కొద్దిపాటిగా ఉత్తేజాన్నిచ్చేందుకుగాను తింటారు. ఇది సరి కానప్పటికి, ఛీజ్ ఎంతో శక్తినిచ్చేదని భావించవచ్చు. శక్తినిచ్చే హార్మోన్లను ఇది రిలీజ్ చేస్తుంది.

take these foods to get rid of fatigue in the evening

స్ట్రాబెర్రీలు – తక్షణ శక్తికి ఈ పండును మించింది లేదు. అధికమైన పీచు, అధిక ఎనర్జీ, అధిక విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు అన్నీ కలబోసిన ఈపండు తక్షణ శక్తినిస్తుంది. గ్రీన్ టీ – నరాలను జివ్వును ఉత్తేజపరచాలంటే గ్రీన్ టీ ఎంతో మంచిది. సాధారణ కాఫీ, టీల కంటే గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా వుంటాయి. లోపలి భాగాలను శుభ్రపరచి అధికమైన శక్తినివ్వటంలో గ్రీన్ టీ ని మించిన పానీయం లేదు.

Admin

Recent Posts