ఆధ్యాత్మికం

విజ‌య‌వాడ ద‌గ్గ‌ర‌లో ఉన్న ఈ గుహాల‌యాల గురించి మీకు తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">గుహాలయాలు&period;&period; అద్భుత కట్టడాలు&period; ఆధునిక సాంకేతికతనే చాలెంజ్‌ చేసే విధంగా వేల ఏండ్ల కిందట నిర్మించిన గుహలు ఎన్నో ఉన్నాయి&period; అలాంటి వాటిలో ప్రసిద్ధి చెంది ఆంధ్రప్రదేశ్‌ రాజధానికి అతి సమీపాన ఉన్న నాలుగు అంతస్తుల గుహాలయాల గురించి తెలుసుకుందాం&period;&period; ఉండవల్లి అంటే తెలుగువారందరికీ గుర్తు వచ్చేవి గుహాలయాలు&period; మామూలుగా చూసే వాళ్ళకి వీటి కోసం ఇంత దూరం రావాలా అనిపించవచ్చు&period; కానీ ఒకే పర్వతాన్ని గుహలుగా మలచటమే కాదు&comma; దాన్లో దేవతా ప్రతిమలతోబాటు దాదాపు 20 అడుగుల ఏక శిలా అనంత పద్మనాభస్వామి&comma; నాభిలో బ్రహ్మ&comma; చుట్టూ దేవతా మూర్తులతో సహా చెక్కిన శిల్పుల చాతుర్యం చూడ గలిగినవారు అద్భుతం అంటారు&period;ఒకే పర్వతాన్ని తొలచి 4 అంతస్తులుగా మలచారు ఈ గుహలని&period; మొదటి అంతస్తు బయట ఋషులు&comma; సింహాలు వగైరా విగ్రహాలున్నాయి&period; పైకి వెళ్తున్న కొద్దీ చిన్నవైన ఈ గుహలు పైన ఖాళీగానే వున్నాయి&period; కింద అంతస్తులో తాపసులు&comma; భిక్షువులు కూర్చునేందుకు వీలుగా స్తంభాల మండపం వున్నది&period; దీని నిర్మాణం అసంపూర్తిగా వున్నది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మొదటి అంతస్తులో నరసింహస్వామి&comma; విఘ్నేశ్వరుడు&comma; దత్తాత్రేయుడు ఇంకా కొన్ని విగ్రహాలు గోడలకి చెక్కి వున్నాయి&period; స్తంభాల మీద కూడా కొన్ని శిల్పాలు వున్నాయి&period; రెండవ అతస్తులో 25 అడుగుల పొడవు 6 అడుగుల‌ వెడల్పుగలిగి ఒకే శిలలో చెక్కిన అనంత పద్మనాభస్వామి శయనించి వుంటారు&period; నాభిలో తామర పుష్పం&comma; అందులో బ్రహ్మ&comma; పాదాల వద్ద మధుకైటభులనే రాక్షసులు&comma; పక్కన విష్ణు వాహనమైన గరుత్మంతుడు&comma; తపస్సు చేస్తున్న ఋషులు&comma; ఇంకా అనేక విగ్రహాలున్నాయి&period; రాతిలో అతుకులు లేకుండా ఒకే రాతిలో స్వామి ఆకారం చెక్కి వుండటం ఈ శిల్పంలోని ప్రత్యేకత&period; ఇక్కడ‌ కొండలో రాతిని మలచి ఈ విగ్రహాన్ని చెక్కారు&period; గర్భాలయ ద్వారానికి జయ విజయుల విగ్రహాలుంటాయి&period; మూడవ అంతస్తులో పూర్తిగా నిర్మింపబడని త్రికూటాలయం&period; వీటిలో విగ్రహాలేమీ వుండవు&period; 14à°µ శతాబ్దంలో ఇక్కడ కొండవీటి రాజులు వేసిన ఒక శాసనం ప్రకారం ఈ గుహాలయాలు 3 లేక 7 à°µ శతాబ్దం నాటి విష్ణుకుండినుల కాలానివనీ&comma; క్రీ&period;à°¶&period; 1343 లో అన్నారెడ్డి కుమారుడు పంచమ రెడ్డి అనంత పద్మనాభునికి అనేక కానుకలు ఇచ్చినట్లు తెలుస్తున్నది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-80536 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;undavalli-caves&period;jpg" alt&equals;"do you know about undavalli caves " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గుహాలయాలనుండి కొండవీటి కోటకు&comma; మంగళగిరి కొండకు&comma; విజయవాడ కనక దుర్గ ఆలయానికి రహస్య మార్గాలున్నాయంటారు&period; పూర్వం ఈ మార్గాలగుండా రాజులు శత్రు రాజులకు తెలియకుండా తమ సైన్యాన్ని తరలించేవారంటారు&period; ఇక్కడ వున్న ఒక సొరంగ మార్గం మూత పడి&comma; పూడి పోయి వుంది&period; కొంత కాలం క్రితం పురావస్తు శాఖవారు ఈ ప్రాంతంలో త్రవ్వకాలు సాగించినప్పుడు కొన్ని బౌధ్ధమత చిహ్నాలు&comma; శిల్పాలు బయట పడ్డాయి&period; దానితో ఒకప్పుడు ఈ కొండపై భాగాన బౌధ్ధారామాలు విలసిల్లాయంటారు&period; విజయవాడకి 2 కి&period;మీ&period;à°² దూరంలో వున్న ఈ గుహలు గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలోని ఉండవల్లి – పెనుమాక గ్రామాల మధ్య వున్నాయి&period; విజయవాడనుంచి&comma; గుంటూరు నుంచి బస్సు సౌకర్యం వున్నది&period; పెద్దపెద్ద క్రేన్‌లు&comma; పరికరాలు లేని సమయంలోనే ఇటువంటి నిర్మాణాలు ఎలా నిర్మించారో అనే విషయం నేటికి అర్థం కాని విషయం&period; వారి సాంకేతికత నేటికి అంతుచిక్కని రహస్యంగా మిగిలింది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts