హెల్త్ టిప్స్

Toxins In Body : ఈ పండ్లని తీసుకుంటే.. శరీరంలోని విష ప‌దార్థాలు బయటకి వచ్చేస్తాయి..!

Toxins In Body : పండ్లు తీసుకుంటే ఆరోగ్యానికి మేలు చేస్తాయి. రకరకాల పోషక పదార్థాలు అందుతాయ‌న్న విషయం మనకి తెలుసు. అయితే, కొన్ని పండ్లు తీసుకుంటే, జీర్ణ ప్రక్రియ బాగుంటుంది. శరీరంలో టాక్సిన్స్ ని బయటికి పంపించేసే పండ్లు కూడా ఉన్నాయి. మరి శరీరంలో టాక్సిన్స్ ని బయటికి పంపించే పండ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పండ్లు తీసుకుంటే మీ ఆరోగ్యం బాగుంటుంది. అలాగే శరీరంలో టాక్సిన్స్ బయటకు వెళ్లిపోతాయి. ఆపిల్స్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.

ఆపిల్ లో విటమిన్స్, ఫైబర్ తోపాటు ఇతర పోషకాలు కూడా ఉంటాయి. ఆపిల్ ని తీసుకోవడం వలన పీచు ఎక్కువ ఉండడం వలన ఎంతో మేలు కలుగుతుంది. ఆపిల్ ని తీసుకోవడం వలన శరీరంలోని టాక్సిన్స్ బయటకు వెళ్లిపోతాయి. జీర్ణక్రియకి సహాయపడుతుంది. నిమ్మకాయ కూడా శరీరంలోని టాక్సిన్స్ ని బయటికి పంపిస్తుంది. అన్ని సిట్రస్ ఫ్రూట్స్ లో కూడా విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి.

take these fruits to get rid of toxins in body

నిమ్మకాయ శరీరాన్ని శుభ్రపరుస్తుంది. కొంచెం గోరువెచ్చని నీళ్లలో నిమ్మరసం వేసుకుని తీసుకుంటే శరీరంలోని టాక్సిన్స్ బయటకు వెళ్ళిపోతాయి. కొంచెం తేనె కూడా కావాలంటే కలుపుకోవచ్చు. శరీరంలోని టాక్సిన్స్ ని బయటకు పంపించడానికి బెర్రీస్ కూడా బాగా ఉపయోగపడతాయి. బ్లాక్ బెర్రీ, స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ వంటి వాటిని మీరు తీసుకోవచ్చు. ఇలా బెర్రీస్ ద్వారా కూడా శరీరంలోని టాక్సిన్స్ బయటకు వెళ్లిపోతాయి. పైనాపిల్ కూడా టాక్సిన్స్ ని బయటకి పంపిస్తుంది.

పైనాపిల్ శరీరంలోని మంటను తగ్గించడానికి కూడా సహాయం చేస్తుంది. ఆర్థరైటిస్ తో బాధపడేవాళ్లు పైనాపిల్ తీసుకుంటే మంచిది. పైనాపిల్ ని తీసుకోవడం వలన శరీరంలోని టాక్సిన్స్ బయటకు వెళ్లి పోతాయి. బొప్పాయి కూడా ఇందుకు సహాయం చేస్తుంది. బొప్పాయిని తీసుకుంటే కూడా శరీరంలోని టాక్సిన్స్ బయటకు వెళ్లిపోతాయి. బొప్పాయిలో విటమిన్ సి, విటమిన్ ఎ, మెగ్నిషియం, పొటాషియం వంటివి దొరుకుతాయి. దానిమ్మని తీసుకుంటే కూడా ఆరోగ్యం బాగుంటుంది. దానిమ్మ కూడా టాక్సిన్స్ ని బయటకు పంపిస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిలని కంట్రోల్ లో ఉంచుతుంది. దానిమ్మని తీసుకోవడం వలన గుండె ఆరోగ్యం కూడా బాగుంటుంది.

Admin

Recent Posts