food

Aratikaya Podi Kura : అరటికాయ పొడి కూర తయారీ ఇలా.. ఈ విధంగా చేస్తే.. ఇష్టంగా తింటారు..

<p style&equals;"text-align&colon; justify&semi;">Aratikaya Podi Kura &colon; మనకు అందుబాటులో ఉన్న పలు రకాల కూరగాయల్లో కూర అరటి కాయలు ఒకటి&period; వీటిని తినేందుకు చాలా మంది ఇష్టపడరు&period; కానీ వీటిని ఉపయోగించి సరైన రీతిలో కూర చేయాలేకానీ ఎవరైనా సరే ఇష్టంగా తింటారు&period; ఈ క్రమంలోనే కూర అరటికాయలతో మనం పొడి కూరను కూడా తయారు చేయవచ్చు&period; ఇది ఎంతో రుచిగా ఉంటుంది&period; దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కూర అరటికాయ పొడి కూర తయారీకి కావల్సిన పదార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కూర అరటికాయలు – 3&comma; ఉల్లిపాయ – 1&comma; పసుపు – పావు టీస్పూన్‌&comma; ఉప్పు – తగినంత&comma; మసాలా ముద్ద కోసం – కొబ్బరి తురుము – 4 టేబుల్‌ స్పూన్లు&comma; చింత పండు – చిన్న నిమ్మకాయంత&comma; బెల్లం తురుము – ఒక టీస్పూన్‌&comma; మసాలా పొడి కోసం – మినప పప్పు – 2 టీస్పూన్లు&comma; ఎండు మిర్చి – 8&comma; ధనియాలు – 2 టీస్పూన్లు&comma; సోంపు – 1 టీస్పూన్‌&comma; తాళింపు కోసం – ఆవాలు – ముప్పావు టీస్పూన్‌&comma; కరివేపాకు రెబ్బలు – 4&comma; నూనె – తగినంత&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-51470 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;aratikaya-podi-kura&period;jpg" alt&equals;"aratikaya podi kura recipe " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కూర అరటికాయ పొడి కూర తయారు చేసే విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మసాలా పొడి కోసం తీసుకున్నవన్నీ వేయించి పక్కన పెట్టాలి&period; చల్లారాక పొడి చేయాలి&period; మసాలా ముద్ద కోసం తీసుకున్న కొబ్బరిని కొద్దిగా వేయించాలి&period; గోధుమ రంగులోకి మారాక పక్కన ఉంచాలి&period; ఇప్పుడు దీనికి చింత పండు&comma; బెల్లం తురుము&comma; తగినంత ఉప్పు చేర్చి మెత్తగా రుబ్బాలి&period; అందులోనే మసాలా పొడి కూడా కలిపి ఉంచాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉల్లిపాయను సన్నని ముక్కలుగా కోయాలి&period; అరటి కాయల్ని ఉడికించి తొక్కు తీసి ముక్కలు ముక్కలుగా పొడి పొడిగా ఉండేలా చిదమాలి&period; బాణలిలో నూనె వేసి తాళింపు దినుసులు వేసి వేగాక ఉల్లిపాయ ముక్కలు వేయించాలి&period; ఇప్పుడు అరటికాయ ముక్కలు&comma; మసాలా ముద్ద వేసి సిమ్‌లో పొడి పొడిగా అయ్యే వరకు వేయించి తీయాలి&period; దీంతో ఎంతో రుచిగా ఉండే అరటికాయ పొడి కూర తయారవుతుంది&period; దీన్ని అన్నంతో వేరే ఏదైనా కూరతో కలిపి తింటే ఎంతో రుచిగా ఉంటుంది&period; అరటి కాయ అంటే ఇష్టం లేని వారు కూడా వాటిని ఇలా వండితే ఎంతో ఇష్టంగా తింటారు&period; ఎంతో రుచిగా కూడా ఉంటుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts