హెల్త్ టిప్స్

Barley Seeds : ఈ గింజ‌ల‌ను ఇలా తీసుకుంటే.. కిడ్నీ స్టోన్లు మంచులా క‌రిగిపోతాయి..!

Barley Seeds : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది అస్త‌వ్య‌స్త‌మైన జీవ‌న విధానం వ‌ల్ల అనేక వ్యాధుల‌ను కొని తెచ్చుకుంటున్నారు. వాటిల్లో కిడ్నీ స్టోన్స్ కూడా ఒక‌టి. ఇవి వ‌చ్చేందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. అయితే కార‌ణాలు ఏమున్న‌ప్ప‌టికీ కిడ్నీ స్టోన్లు ఉన్న‌వారు తినే ఆహారం విష‌యంలో జాగ్ర‌త్త వ‌హించాలి. లేదంటే స‌మ‌స్య మ‌రింత తీవ్ర‌త‌రం అయి కిడ్నీలు చెడిపోయేందుకు అవ‌కాశాలు ఉంటాయి. ఇక కిడ్నీ స్టోన్లు ఉన్న‌వారు డాక్ట‌ర్లు ఇచ్చే మందుల‌ను వాడుతూనే మ‌రోవైపు ప‌లు చిట్కాల‌ను పాటించాలి. దీంతో స్టోన్స్ త్వ‌ర‌గా క‌రిగిపోతాయి. ఇక కిడ్నీ స్టోన్స్‌ను క‌రిగించేందుకు బార్లీ గింజ‌లు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి.

బార్లీ నీళ్లు కిడ్నీల‌లోని రాళ్ల‌ను క‌రిగిస్తాయి. బార్లీలో ఫైబ‌ర్‌, విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ వంటి పోషకాలు సమృద్దిగా ఉంటాయి. ఇవి మనకు ఎన్నో రకాలుగా సహాయపడతాయి. కిడ్నీలో రాళ్ళు ఉన్నప్పుడు విపరీతమైన నొప్పి క‌లుగుతుంది. అయితే రాళ్ళు చిన్నగా ఉంటే మాత్రం ఇంటి చిట్కాలు బాగా పనిచేస్తాయి. రాళ్ళు పెద్దగా ఉంటే మాత్రం డాక్టర్ ఇచ్చిన మందులను వాడుతూ బార్లీ నీటిని తాగితే చాలా తొందరగా ఉపశమనం కలుగుతుంది. బార్లీ నీటిని రోజులో రెండు సార్లు తాగితే కిడ్నీ ఇన్ ఫెక్షన్ కూడా తగ్గుతుంది.

take these seeds daily to remove kidney stones

బార్లీ గింజలు మనకు సులభంగానే అందుబాటులో ఉంటాయి. చాలా చవకగా లభిస్తాయి. పొయ్యి మీద గిన్నె పెట్టి రెండు గ్లాసుల నీటిని పోసి రెండు టీస్పూన్ల బార్లీ గింజలను రఫ్ గా గ్రైండ్ చేసి వేయాలి. 5 నుంచి 7 నిమిషాల పాటు మరిగించి ఈ నీటిని వడకట్టాలి. ఈ నీరు కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే అరచెక్క నిమ్మరసం కలిపి తాగాలి.

ఈ బార్లీ నీటిని రోజులో రెండు సార్లు తీసుకుంటే కిడ్నీలో ఉన్న చిన్న చిన్న రాళ్ళు అన్నీ కరిగిపోతాయి.అంతేకాక వేసవిలో వడదెబ్బ నుండి ఉపశమనం కలుగుతుంది. అలాగే నీరసం, అలసట వంటివి లేకుండా చురుకుగా ఉంటారు. అధిక బరువు, శ‌రీరంలో అదనంగా ఉన్న కొవ్వు కరిగిపోతుంది. ఇలా బార్లీ నీళ్ల‌ను తాగ‌డం వ‌ల్ల కిడ్నీ స్టోన్స్ క‌రిగిపోవ‌డంతోపాటు ఇత‌ర ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను కూడా పొంద‌వచ్చు. క‌నుక ఈ నీళ్ల‌ను రోజూ తాగాలి. దీంతో అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చు.

Admin

Recent Posts