సాధారణంగా చాలా మందికి వేళకు భోజనం చేయకపోయినా, నూనె, కొవ్వు పదార్థాల, చిరుతిళ్లు, జంక్ ఫుడ్‌ను ఎక్కువగా తిన్నా.. గ్యాస్ వస్తుంటుంది. అలాగే శరీరంలో వ్యర్థాలు పేరుకుపోతుంటాయి. కానీ కింద తెలిపిన జ్యూస్ లను తాగడం వల్ల శరీరాన్ని అంతర్గతంగా శుభ్రం చేసుకోవచ్చు. దీంతోపాటు పలు ఇతర ప్రయోజనాలు కూడా కలుగుతాయి. మరి ఆ జ్యూస్‌లు ఏమిటంటే..
1. ఒక క్యారెట్‌ను చిన్న ముక్కలుగా కోయాలి. అందులో చిన్న అల్లం ముక్కలు వేయాలి. తరువాత జ్యూస్ తీయాలి. దాన్ని వడబోసి అందులో కొద్దిగా తేనె, నిమ్మరసం కలిపి తాగాలి. దీన్ని రోజూ ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో భాగంగా తీసుకోవాలి. దీంతో శరీరానికి అనేక పోషకాలు అందుతాయి. శరీరం అంతర్గతంగా శుభ్రమవుతుంది. గ్యాస్ తగ్గుతుంది. అధిక బరువు తగ్గుతారు. కంటి చూపు మెరుగు పడుతుంది.
2. రోజూ పాలకూర రసం కూడా తాగవచ్చు. ఇందులో కొత్తిమీర కలిపి జ్యూస్ చేసుకుని దాంట్లో నిమ్మరసం కలిపి తాగవచ్చు. దీని వల్ల కూడా శరీరం అంతర్గతంగా శుభ్రంగా మారుతుంది. అలాగే ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. రక్తహీనత నుంచి బయట పడవచ్చు.
3. బీట్‌రూట్‌ను చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో అల్లం ముక్కలు, సైంధవ లవణం వేసి జ్యూస్ లా పట్టి తాగవచ్చు. ఈ జ్యూస్ వల్ల కూడా శరీరం శుభ్రమవుతుంది. రక్తహీనత, బీపీ తగ్గుతాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
4. ఈ జ్యూస్‌లలాగే కీరదోస, టమాటా, గుమ్మడికాయ వంటి జ్యూస్‌లను కూడా ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌తో తీసుకోవచ్చు. దీంతో వాటి ద్వారా అనేక పోషకాలు, శక్తి లభిస్తాయి. ఆరోగ్యంగా ఉండవచ్చు.