భారతదేశంలో డయాబెటిక్ రోగుల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. డయాబెటిస్ ఉందని కూడా తెలియని వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ఈ సమస్యను ప్రీ-డయాబెటిస్ అంటారు. కానీ సరైన ఆహారం సహాయంతో రక్తంలో చక్కెరస్థాయిలను నియంత్రించవచ్చు. దీంతో మధుమేహం నుండి ఉపశమనం పొందవచ్చు. చక్కెర స్థాయిలను నియంత్రించడానికి మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉదయం నిర్ధిష్ట సమయంలోగా బ్రేక్‌ఫాస్ట్‌ను పూర్తి చేయాలి.
ఎండోక్రైన్ సొసైటీలో ప్రచురించబడిన, నార్త్ వెస్ట్రన్ యూనివర్సిటీ నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం.. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉదయం 8.30 గంటలలోగా అల్పాహారం తీసుకోవాలి. పరిశోధనలో భాగంగా ఈ విధంగా తీసుకున్న వారి రక్తంలో చక్కెర స్థాయిలు, ఇన్సులిన్ నిరోధకత తగ్గుతూ కనిపించాయి. ఇన్సులిన్ నిరోధకత ఎక్కువైతే రక్తంలో చక్కెర స్తాయిలు పెరుగుతాయి. అయితే బ్రేక్‌ఫాస్ట్‌ను త్వరగా చేసేయడం వల్ల షుగర్ లెవల్స్ తగ్గడంతోపాటు ఇన్సులిన్ నిరోధకత కూడా తగ్గిందని తేల్చారు. అందువల్ల ఉదయం త్వరగా బ్రేక్‌ఫాస్ట్ చేయాలని సూచిస్తున్నారు.
ఇక ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో భాగంగా ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారాలను తినాలని చెబుతున్నారు. ముఖ్యంగా కోడిగుడ్లు, ఓట్ మీల్, పెసలు, గంజి వంటి ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది.
ఈ ఆహారాల్లో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఇవి షుగర్ ఉన్నవారికి మేలు చేస్తాయి. రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించేందుకు, ఇన్సులిన్ నిరోధకతను తగ్గించేందుకు ఉపయోగపడతాయి. అందువల్ల వీటిని బ్రేక్‌ఫాస్ట్ లో తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది. ఇక పైన తెలిపిన సమయంలోగా బ్రేక్‌ఫాస్ట్‌ను చేస్తే మంచిది. దీంతో షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి. కుదిరితే ఇంకా ముందుగానే బ్రేక్‌ఫాస్ట్ చేస్తే ఇంకా మంచిగా చక్కెర స్థాయిలను తగ్గించుకోవచ్చు.