Clogged Arteries : రోజుకు ఒక గ్లాస్ ఈ పానీయాన్ని తీసుకోవడం వల్ల తలనుండి పాదాల వరకు రక్తనాళాల్లో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ను పూర్తిగా కరిగించుకోవచ్చు. మన ఆరోగ్యం చక్కగా ఉండాలంటే ప్రతి అవయవానికి రక్తప్రసరణ సాఫీగా సాగాలి. రక్తప్రసరణ సాఫీగా సాగితేనే ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. రక్తప్రసరణ వ్యవస్థలో చిన్న సమస్య తలెత్తినా సరే మనం అనేక అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది. రక్తప్రసరణ వ్యవస్థను సాఫీగా ఉంచుకోవడం చాలా అవసరం. అయితే ప్రస్తుత కాలంలో రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోయి చాలా మంది అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు.
కొలెస్ట్రాల్ కూడా మన శరీరానికి అవసరమే. ఎల్ డి ఎల్ ( చెడు కొలెస్ట్రాల్), హెచ్ డి ఎల్ ( మంచి కొవ్వు) అని రెండు రకాల కొలెస్ట్రాల్ ఉంటుంది. కొలెస్ట్రాల్ మన శరీరానికి అవసరమే అయినప్పటికి ఇది అధికంగా ఉంటే అన్నే అనర్థాలు ఎదురవుతాయి. రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోతే శరీర భాగాలకు రక్తసరఫరా సాగదు. దీంతో గుండె పోటు, గుండె జబ్బులు, డయాబెటిస్, బీపీ అలాగే కాలేయం, మూత్రపిండాల సమస్యలు కూడా వస్తాయి. కనుక రక్తనాళాల్లో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ను తొలగించుకోవడం చాలా అవసరం. మన ఇంట్లో ఉండే పదార్థాలతో ఒక పానీయాన్ని తయారు చేసుకుని తీసుకోవడం వల్ల రక్తనాళాల్లో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ అంతా తొలగిపోతుంది. అంతేకాకుండా భవిష్యత్తులో కూడా ఈ సమస్య రాకుండా ఉంటుంది.
రక్తనాళాల్లో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ను కరిగించే ఈ పానీయాన్ని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పానీయాన్ని తయారు చేసుకోవడానికి గానూ ముందుగా ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీటిని తీసుకుని వేడి చేయాలి. నీళ్లు కొద్దిగా వేడయ్యాక అందులో 2 టేబుల్ స్పూన్ల నల్ల ఎండు ద్రాక్షను వేయాలి. తరువాత ఇందులో ఒక స్పూన్ అల్లం తరుగును వేసి ఈ నీటిని పది నిమిషాల పాటు బాగా మరిగించాలి. ఇలా మరిగించిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి ఇందులో ఒక ఒక టీ స్పూన్ గ్రీన్ టీ పొడిని వేయాలి. తరువాత ఈ గిన్నెపై మూతను ఉంచి పది నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తరువాత ఈ నీటిని వడకట్టి ఒక గ్లాస్ లోకి తీసుకోవాలి. తరువాత ఇందులో ఒక టీ స్పూన్ తేనెను వేసి కలపాలి. షుగర్ వ్యాధి గ్రస్తులు తేనెను వేసుకోకపోవడమే మంచిది.
ఇలా తయారు చేసుకున్న పానీయాన్ని రోజంతా ఉపయోగించుకోవచ్చు. ఈ పానీయాన్ని రెండు లేదా మూడు టీ స్పూన్ల మోతాదులో తీసుకుని ఒక గ్లాస్ నీటిలో కలిపి భోజనానికి గంట ముందు తీసుకోవాలి. ఆహారాన్ని తీసుకునే ప్రతిసారి ఈ పానీయాన్ని ఈ విధంగా తీసుకోవాలి. ఈ పానీయాన్ని తీసుకున్న రెండు నుండి మూడు రోజుల్లోనే మన శరీరంలోనే వచ్చే మార్పును గమనించవచ్చు. ఈ పానీయాన్ని తీసుకోవడం వల్ల రక్తనాళాల్లో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ అంతా కరిగిపోతుంది.
గుండె సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే శరీరంలో ఇతర అనారోగ్య సమస్యలు కూడా తలెత్తకుండా ఉంటాయి. ఈ పానీయాన్ని తీసుకోవడం వల్ల సమస్య తగ్గడంతో పాటు భవిష్యత్తులో కూడా రాకుండా ఉంటుంది. ఈ చిట్కాను పాటిస్తూనే మనం కొన్ని జాగ్రత్తలను తీసుకోవాలి. రోజు కనీసం 8 గ్లాసుల నీళ్లు తీసుకోవాలి. జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలి. సిట్రస్ జాతికి చెందిన పండ్లను ఎక్కువగా తీసుకోవాలి. ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఈ చిట్కాను పాటిస్తూనే తగిన ఆహార నియమాలను పాటించడం వల్ల రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా ఉంటుంది.