Aloo Pulao : ఆలు పులావ్‌ను ఇలా చేస్తే.. ఒక ముద్ద ఎక్కువే తింటారు.. రుచి అద్భుతంగా ఉంటుంది..

Aloo Pulao : బంగాళాదుంప‌ల‌తో మనం ర‌క‌ర‌కాల వంట‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. బంగాళాదుంప‌ల‌తో చేసే వంట‌ల‌ను తిన‌డం వ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. బంగాళాదుంప‌లతో కూర‌ల‌నే కాకుండా మ‌నం ఆలూ పులావ్ ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ ఆలూ పులావ్ చాలా రుచిగా ఉంటుంది. వంట‌రాని వారు కూడా దీనిని త‌యారు చేసుకోవ‌చ్చు. బంగాళాదుంప‌ల‌తో పులావ్ ను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ఆలూ పులావ్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

పెద్ద ముక్క‌లుగా త‌రిగిన బంగాళాదుంప‌లు – 2, నాన‌బెట్టిన బాస్మ‌తీ బియ్యం – రెండు గ్లాసులు, నెయ్యి – ఒక టేబుల్ స్పూన్, నూనె – ఒక టేబుల్ స్పూన్, స‌న్న‌గా పొడుగ్గా త‌రిగిన ఉల్లిపాయ – 1, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, త‌రిగిన ట‌మాట – 1, కారం – ఒక టీ స్పూన్, గ‌రం మ‌సాలా – ఒక టీ స్పూన్, త‌రిగిన కొత్తిమీర – అర క‌ట్ట‌, త‌రిగిన పుదీనా – అర క‌ట్ట‌, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, పెరుగు – 2 టేబుల్ స్పూన్స్, నీళ్లు – మూడు గ్లాసులు, ఉప్పు – త‌గినంత‌, ప‌చ్చి బ‌ఠాణీ – ఒక టేబుల్ స్పూన్.

Aloo Pulao recipe in telugu make in this method
Aloo Pulao

మ‌సాలా దినుసులు..

దాల్చిన చెక్క – రెండు ఇంచుల ముక్క‌, ల‌వంగాలు – 4, యాల‌కులు – 4, అనాస పువ్వు – 1, మ‌రాఠి మొగ్గ – 1, జాప‌త్రి – 1, బిర్యానీ ఆకులు – 2, సాజీరా – ఒక టీ స్పూన్.

ఆలూ పులావ్ త‌యారీ విధానం..

ముందుగా ఒక క‌ళాయిలో నూనె, నెయ్యి వేసి వేడి చేయాలి. ఇవి వేడ‌య్యాక మ‌సాలా దినుసులు వేసి వేయించాలి. ఇవి వేగిన త‌రువాత ఉల్లిపాయ‌, ప‌చ్చిమిర్చి, బ‌ఠాణీ వేసి వేయించాలి. త‌రువాత అల్లం పేస్ట్ వేసి ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత ట‌మాట ముక్క‌లు, కారం, గ‌రం మ‌సాలా వేసి క‌లిపి ట‌మాట ముక్క‌లు మెత్త‌గా అయ్యే వేయించాలి. త‌రువాత కారం, గ‌రం మ‌సాలా, కొత్తిమీర‌, పుదీనా, క‌రివేపాకు వేసి క‌ల‌పాలి. త‌రువాత పెరుగు వేసి నిమిషం పాటు క‌లుపుతూ వేయించాలి. త‌రువాత బంగాళాదుంప ముక్క‌లు వేసి క‌లిపి మూత పెట్టి అవి కొద్దిగా మెత్త‌గా అయ్యే వ‌ర‌కు మ‌గ్గించాలి. త‌రువాత బాస్య‌తి బియ్యం వేసి క‌లపాలి. త‌రువాత నీళ్లు, ఉప్పు వేసి క‌లిపి మూత పెట్టి నీళ్లు అన్ని అయిపోయే వ‌ర‌కు ప‌డే వ‌ర‌కు మ‌ధ్య‌స్థ మంట‌పై ఉడికించాలి.

త‌రువాత మూత‌పెట్టి చిన్న మంట‌పై మ‌రో 5 నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. స్ట‌వ్ ఆఫ్ చేసిన త‌రువాత 10 నిమిషాల పాటు అలాగే ఉంచి త‌రువాత స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఆలూ ప‌లావ్ త‌యార‌వుతుంది. దీనిని రైతా, మ‌సాలా క‌ర్రీ వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇంట్లో అంద‌రూ దీనిని ఒక్క ముద్ద కూడా విడిచిపెట్ట‌కుండ తింటారు. బంగాళాదుంప‌ల‌తో త‌ర‌చూ చేసే వంట‌కాల‌తో పాటు ఇలా అప్పుడ‌ప్పుడూ పులావ్ ను కూడా త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు.

D

Recent Posts