Pain Killer Drink : చాలామంది ఈ రోజుల్లో, నొప్పులతో బాధపడుతున్నారు. విశ్రాంతి లేకుండా ఎక్కువ పనిచేయడం, బాగా అలసిపోవడం, అధిక ఒత్తిడి వంటి కారణాల వలన చాలామందికి నొప్పులు వస్తున్నాయి. నొప్పులు వస్తున్నాయని, చాలామంది పెయిన్ కిల్లర్స్ ని వేసుకుంటారు. కానీ, తాత్కాలికంగా మాత్రమే ఉపశమనం దొరుకుతుంది. నాచురల్ పెయిన్ కిల్లర్ గా పనిచేసే వాము ఆకు నొప్పిని బాగా దూరం చేస్తుంది. వాము ఆకుతో, డ్రింక్ తయారు చేసుకుని తాగినట్లయితే, అన్ని రకాల నొప్పుల నుండి కూడా రిలీఫ్ కలుగుతుంది.
కీళ్ల నొప్పులు మొదలు, ఒంటినొప్పులు అన్నీ కూడా తొలగిపోతాయి. ఉపశమనం త్వరగా లభిస్తుంది. ఒక మిక్సీ జార్ తీసుకుని, అరకప్పు వాము ఆకులు, ఒక స్పూన్ అల్లం ముక్కలు కొంచెం నీటిని పోసి, మిక్సీ పట్టాలి. మిక్సీ పట్టాక, ఈ మిశ్రమాన్ని గ్లాసులోకి వడకట్టుకోండి. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ తేనె, ఒక స్పూన్ నిమ్మరసం కలిపి తీసుకోండి. ఒక స్పూన్ నానబెట్టిన సబ్జా గింజలను కూడా కలుపుకోవచ్చు.
దీనిని తాగడం వలన నొప్పులకి గుడ్ బై చెప్పేయొచ్చు. పైగా పెయిన్ కిల్లర్స్ వేసుకోకుండానే, నొప్పులు బాగా తగ్గుతాయి. ఈ డ్రింక్ ని రోజు తీసుకున్నట్లయితే, నొప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది. పైగా ఈ డ్రింక్ ని తీసుకోవడం వలన రోగనిరోధక శక్తి కూడా బాగా పెరుగుతుంది.
అధిక బరువు ఉన్నవాళ్లు, అదనంగా పేరుకుపోయిన కొవ్వును కరిగించుకోవడానికి, ఈ డ్రింక్ తీసుకోవచ్చు. వాము ఆకులో ఉండే చక్కటి గుణాలు నొప్పుల నుండి ఉపశమనాన్ని కలిగిస్తాయి. ఆకలిని కూడా పెంచుతాయి. ఆకలి లేని వాళ్ళు ఈ డ్రింక్ ని తీసుకుంటే, ఆకలి పుడుతుంది. ఈ డ్రింక్ ని తీసుకుంటే, మూత్రపిండాల్లో రాళ్లు, గుండె సంబంధిత సమస్యలు కూడా ఉండవు.